Free Education: ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు
అనకాపల్లి : విద్యా హక్కు చట్టం–2009 సెక్షన్ 12(1)సి ప్రకారం 2024–25 విద్యాసంవత్సరానికి ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 31వ తేదీ వరకు పెంచినట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ తెలిపారు. ఈ గడువు ఈ నెల 25వ తేదీ సోమవారంతో ముగిసిందని, మరింతమందికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో గడువును పెంచినట్టు ఆమె తెలిపారు. విద్యార్థులు తమ నివాసానికి సమీపంలో ఉన్న ఐబీ, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, స్టేట్ సిలబస్ అనుసరిస్తున్న అన్ని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో ప్రవేశం పొందవచ్చని, ఇందుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉందన్నారు. జిల్లాలో మొత్తం 312 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయన్నారు. ఇంకా ఆసక్తి ఉన్న వారు సీఎస్‌ఈ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్, స్థానిక సచివాలయం, ఎంఈవో కార్యాలయం, మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు కార్యాలయ పనివేళల్లో సమగ్ర శిక్ష పాఠశాల విద్య శాఖ టోల్ ఫ్రీ నంబర్ 18004258599 లో సంప్రదించాలని ఆమె సూచించారు.
Tags
- free education
- Latest admissions
- Telugu News
- akshieducation latest News
- Admissions 2024
- Education News
- free education Admissions 2024
- AcademicYear2024
- ExtensionNotice
- DistrictEducationOfficer
- MVenkatalakshmamma
- OpportunityExtension
- RightToEducationAct
- AdmissionsDeadline
- FreeAdmissions
- sakshieducationadmissions