Osmania University : ఓయూలో డిగ్రీ కోర్సులు.. ఇకపై నాలుగేళ్లు..

సాక్షి ఎడ్యుకేషన్: ఉస్మానియా యూనివర్సిటీలో 1970 కి ముందు తొలగించిన డిగ్రీ కోర్సులను మరోసారి ఇప్పుడు నాలుగేళ్ల కోర్సులుగా తీస్కురానున్నారు. వర్సిటీ చరిత్రలో ఇప్పటివరకు పీజీ కోర్సులే నడుస్తూ వస్తున్నాయి. ఇందులో చదివినవారిలో చాలామంది నేడు ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. అందరికీ తెలిసి, ఈ యూనివర్సిటీలో కేవలం పీజీ కోర్సులే ఉన్నాయి. కానీ, 1970కి ముందు డిగ్రీ కోర్సులు కూడా ఉండేవి. అప్పుడు అవి తొలగించి కేవలం పీజీ కోర్సులను మాత్రమే ఇప్పటివరకు నడిపించారు.
నాలుగేళ్ల కోర్సుగా..
1970కి ముందు తొలగించిన డిగ్రీ కోర్సులను ఆ తర్వాత పునరుద్ధరించడం ఇదే తొలిసారి. కొన్ని కాలేజీల్లో ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చాయి. చాలా కళాశాలల్లో మూడేళ్ల కోర్సుగా ఉన్నప్పటికీ, యూనివర్సిటీలో ప్రవేశపెట్టనున్న డిగ్రీ కోర్సులకు నాలుగేళ్ల వ్యవధిని ప్రకటిస్తున్నారు. తొలుత బీఏ తెలుగు కోర్సును ఓయూ ఆర్ట్స్ కాలేజీలో ప్రవేశపెడతారు.
Bucket System in Degree Courses : ఇకపై డిగ్రీలో బకెట్ సిస్టమ్ రద్దు కానుందా..!! అసలేమిటిది..!
సోమవారం, ఫిబ్రవరి 17వ తేదీన మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఆర్ట్స్ కోర్సుల సిలబస్ రివిజన్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత దశలవారీగా డిగ్రీ కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తారు. ఇది నాలుగేండ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సు కాగా ఈ కోర్సు పూర్తిచేసిన వారు ఏడాదిలోపు పీజీ కోర్సును పూర్తి చేసుకోవచ్చు.
సివిల్స్ సిలబస్..
డిగ్రీ కోర్సుల్లోని సిలబస్‌లో మార్పులు చేశారు. దీంతో సివిల్స్‌ను సులభతరం చేయగలమన్న దిశలో అధికారులు బీఏ తెలుగు కోర్సుకు రూపకల్పన చేశారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ కోర్సును ఆర్ట్స్ కాలేజీలో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Degree Courses
- Osmania University
- 1970
- post graduation courses
- students education
- four years duration for degree courses
- cancel of degree courses in 1970
- degree syllabus changes
- new academic year
- arts college
- degree courses syllabus changes
- ba telugu
- Higher Education Council
- civils syllabus in degree
- Four-year honors degree course
- Education News
- Sakshi Education News