Skip to main content

Dravidian University: భాషలపై పరిశోధనల కోసమే ద్రవిడ వర్సిటీ

దేశంలోనే భాషా పరిశోధనల కోసం ఏర్పాటు చేసిన ఏకైక యూనివర్సిటీ ద్రవిడ వర్సిటీ మాత్రమేనని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
Dravidian University
మాట్లాడుతున్న రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

అక్టోబర్‌ 19న ద్రవిడ వర్సిటీ సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పాండిచ్చేరితో కలిపి ఐదు రాష్ట్రాల భాషలపై పరిశోధనా కేంద్రంగా ఏర్పాటు చేసిన ద్రవిడ వర్సిటీ మన రాష్ట్రంలో ఉండడం గర్వకారణమన్నారు. మొదట్లో మాజీ ముఖ్యమంత్రి రామారావు యూనివర్సిటీ ప్రారంభించారని, అనంతరం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్సిటీ అభివృద్ధికి 6 కోట్ల రూపాయలు కేటాయించి అభివృద్ధి చేశారని చెప్పారు.

చదవండి: Martyrs Remembrance Day: పోలీస్‌ వ్యాసరచన పోటీ

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యావ్యవస్థకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తూ ముందుకు సాగుతున్నారన్నారు. యూనివర్సిటీ స్థితిగతులను సీఎం దృష్టికి తీసుకెళ్లి మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీ రెడ్డెప్ప, పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ, ఎమ్మెల్సీ భరత్, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ శ్రీనివాసులు, వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ తుమ్మల రామకృష్ణ, రిజిస్ట్రార్‌ వేణుగోపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చదవండి: పొఫెసర్‌ అడపాకు ఓయూ వీసీ అభినందనలు

Published date : 20 Oct 2022 04:50PM

Photo Stories