Skip to main content

పొఫెసర్‌ అడపాకు ఓయూ వీసీ అభినందనలు

తెలంగాణ చరిత్ర, సంస్కృతిపైన వెలువడిన సమగ్రమైన పుస్తకం ‘తెలంగాణ హిస్టరీ, కల్చర్‌ అండ్‌ మూవ్‌మెంట్స్‌’ అని ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ డి రవీందర్‌ తెలిపారు.
OU VC Congratulations to Professor Adapa
పొఫెసర్‌ అడపాకు ఓయూ వీసీ అభినందనలు

పుస్తక రచయితలు ప్రొఫెసర్‌ అడపా సత్యనారాయణ, డాక్టర్‌ ద్యానవల్లి సత్యనారాయణలను ఆయన అభినందించారు. తెలంగాణ పబ్లికేషన్స్‌ వ్యవస్థాపకులు కోయ చంద్రమోహన్,తో పాటు పుస్తక రచయితలు అక్టోబర్‌ 17న వైస్‌చాన్సలర్‌ను కలిసి పుస్తకాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ, ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాల తెలంగాణ చరిత్ర, ఉద్యమాలను సమగ్రంగా విశ్లేషిస్తూ సమగ్ర గ్రంథాన్ని తీసుకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ పబ్లికేషన్స్‌ మరిన్ని విలువైన పుస్తకాలను ముద్రించాలని ఆకాంక్షించారు. 

 TSPSC Group 1 - 2022 Question Paper with Key (Held on 16.10.2022 )

Published date : 18 Oct 2022 01:34PM

Photo Stories