తెలంగాణ పోలీస్ ఆన్‌లైన్ వ్యాస రచన పోటీ నిర్వహించనుంది.
పోలీస్ వ్యాసరచన పోటీ
విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసులను స్మరించుకుంటూ అక్టోబర్ 21న అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులకు తెలంగాణ పోలీస్ ఆన్‌లైన్‌లో తెలుగు /ఉర్దూ /ఇంగ్లిష్ లో వ్యాస రచన పోటీ నిర్వహించనున్నట్లు తెలిపింది.
2 భాగాల్లో ఈ పోటీలను నిర్వహిస్తోంది. మొదటి భాగంలో 5వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులకు ‘రోడ్డు ప్రమాదాలను నిర్మూలించడంలో పౌరుల పాత్ర’అనే అంశంపై పోటీ నిర్వహిస్తామని పేర్కొంది. రెండో విభాగంలో డిగ్రీ నుంచి ఆపై విద్యార్థులకు ‘సైబర్ నేరాల నిర్మూలన అనే అంశంపై పోటీ నిర్వ హిస్తారు. వ్యాసాన్ని https: //forms.gle/y5kk13WkPQYvgfW16 లింక్‌ని క్లిక్ చేసి పంపించాలి.