Skip to main content

TS Constable & SI Exam Cut off Marks: ఎస్సై, కానిస్టేబుల్‌ పరీక్షల కటాఫ్ మార్కులు ఇవే.. ఇన్ని మార్కులు సాధిస్తే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణలో నిర్వహించనున్న పోలీస్‌ పరీక్షలకు ఎస్సీ, ఎస్టీ కటాఫ్ మార్క్‌ 40 మార్కులను ప్రభుత్వం నిర్ణయించింది.

మొత్తం 200 మార్కులకు బీసీలకు 50, ఓసీలకు 60 కటాఫ్‌ మార్కులుగా పేర్కొంటూ తాజాగా జీవో విడుదల చేసింది. 

​​తెలంగాణ ఎస్ఐ,కానిస్టేబుల్ ప‌రీక్ష‌ల బిట్‌బ్యాంక్ కోసం క్లిక్ చేయండి

గతంలో ఈ మార్కులు ఓసీలకు 80 (40%), బీసీలకు 70(35%), ఎస్సీ, ఎస్టీలకు 60 (30%)గా ఉండేది. అయితే ఎస్సై, కానిస్టేబుల్‌ ఎగ్జామ్‌ రాసిన వారికి కటాఫ్‌ మార్కులు తగ్గిస్తూ కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

TS SI Preliminary Exam 2022 Result : ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష‌ ఫలితాలు ఎప్పుడంటే..?

30% మార్కులు సాధిస్తే..

ts police

సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ప్రకటన మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామకాల బోర్డు సప్లిమెంటరీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. అలాగే సబ్‌ ఇన్‌స్పెక్టర్, టీఎస్‌ ఎల్‌పీఆర్‌బీ విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం.. 30% మార్కులు సాధిస్తే వారు అర్హత సాధిస్తారని ప్రకటించింది. ఈ జీవో ప్ర‌కారం ఓసీల‌కు 30 %, బీసీల‌కు 25% , ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌ల‌కు 20% మార్కులు సాధిస్తే క్వాలిఫై అవుతారు.

తెలంగాణ పోలీసు ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి 

కొత్త కటాఫ్‌ మార్కులను ప్రకటిస్తూ..
వీటిపై విచారణ జరుగుతుండగానే, ప్రభుత్వం కొత్త కటాఫ్‌ మార్కులను ప్రకటిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ విషయాన్ని ప్రభుత్వ న్యాయవాది న్యాయస్థానానికి వెల్లడించారు. దీంతో ఈ పిటిషన్లను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం కొట్టివేసింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది చిల్ల రమేశ్‌ వాదనలు వినిపించారు. ప్రభుత్వ తాజా నిర్ణయం పిటిషనర్లకు ఆమోదయోగ్యంగా ఉండటంతో ధర్మాసనం వాదనలు ముగించింది.

ఎస్సై ప్రిలిమినరీ ప‌రీక్ష కొశ్చ‌న్ పేప‌ర్ & ‘కీ’  కోసం క్లిక్ చేయండి

చ‌ద‌వండి : TS Police Jobs Events: ఈవెంట్స్ కొట్టాలంటే.. ఇవి పాటించాల్సిందే..!

Published date : 18 Oct 2022 03:11PM

Photo Stories