TS SI Preliminary Exam 2022 Result : ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ఎప్పుడంటే..?
అలాగే ఇప్పటికే ఈ ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ ని ఆగస్టు 12వ తేదీన అధికారులు విడుదల చేశారు.
చదవండి : TS Police Jobs Events: ఈవెంట్స్ కొట్టాలంటే.. ఇవి పాటించాల్సిందే..!
ఫలితాలతో పాటు ఫైనల్ ‘కీ’ ని కూడా..
మొత్తం 554 ఎస్‌ఐ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. ఏకంగా 2,47,217 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,25,759 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇక సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) ప్రిలిమినరీ రాతపరీక్ష-2022 ఫలితాలను సెప్టెంబర్ నెలాఖరులో విడుదల చేసేందుకు తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. అలాగే ఈ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) ప్రిలిమినరీ రాతపరీక్ష-2022 ఫలితాలతో పాటు ఫైనల్ ‘కీ’ ని కూడా ఒకే సారి విడుదల చేసే అవకాశం ఉంది.
ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష కొశ్చన్ పేపర్ & ‘కీ’ కోసం క్లిక్ చేయండి
ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష అర్హత మార్కులు ఇవే..
ఎస్సై ప్రిలిమినరీ పరీక్షను మొత్తం 200 మార్కులను నిర్వహించారు. ఇందులో 60 మార్కులు సాధించిన వారు తర్వాత పరీక్షకు అర్హత సాధిస్తారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి ఈవెంట్స్ నిర్వహిస్తారు. ఈవెంట్స్ లోనూ అర్హత పొందిన వారికి తుది పరీక్ష ఉంటుంది. ఫైనల్‌గా ఈ రాత పరీక్షలో ప్రతిభ చూపిన వారికి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగ ఎంపికలో రిజర్వేషన్ ను పాటిస్తారు.
మార్చిలోగా ఎంపిక ప్రక్రియను..
అక్టోబర్ చివరి నాటికి ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు శరీర దారుఢ్య పరీక్షలు, రన్నింగ్, లాంగ్ జంప్, షార్ట్ ఫుట్ లాంటివి పూర్తి చేయనున్నారు. వీటి కోసం పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు పోలీస్ క్రీడా మైదానాలు, ఇతర క్రీడా ప్రాంగణాల ఎంపికపై దృష్టి సారించింది. సుదీర్ఘ ప్రక్రియ అయిన ఈ పరీక్షలే నియామకాల్లో కీలకంగా ఉన్నాయి. అలాగే ఈ పీఈటీ ఫలితాలను నవంబర్ చివరలో ప్రకటించి.. వచ్చే సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరిలో తుది రాత పరీక్షలు నిర్వహించి.. మార్చిలోగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేసే విధంగా చర్యలు ప్రారంభించారు.
తెలంగాణ ఎస్ఐ,కానిస్టేబుల్ పరీక్షల బిట్‌బ్యాంక్ కోసం క్లిక్ చేయండి
TS Police Exams Best Preparation Tips: పక్కా వ్యూహంతో.. ఇలా చదివితే పోలీస్ ఉద్యోగం మీదే..!