TS SI & Constable Final Exam Result Date 2023 : ఎస్సై, కానిస్టేబుల్ ఫైనల్ ఫలితాలు ఎప్పుడంటే..?

అన్ని అనుకున్నట్టు జరిగితే.. జూన్ మొదటి వారంలో తుది ఫలితాలు వెలువడనున్నాయి. అనంతరం అభ్యంతరాల నమోదుకు అవకాశమిస్తారు.
సరిఫికెట్ల పరిశీలన ఎప్పుడంటే..?

మే నెల మొత్తం ఎస్సై, కానిస్టేబుల్ తుది పరీక్ష మూల్యాంకన జరగనుందని అధికారులు తెలిపారు. ఈ పరీక్షల తుది ఫలితాలు ఒక కొలిక్కి వచ్చాక ఎంపికైన అభ్యర్థుల విద్యార్హతలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలను జూన్‌లో పరిశీలించనున్నారు. జిల్లా కేంద్రాల్లో అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనలకు తగిన ఏర్పాట్లు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈసారి తుది రాతపరీక్షలో ఎంపికైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను మాత్రమే పరిశీలించాలని క్రితంసారి నిర్ణయించారు. ఈసారీ అలాగే చేయనుండటంతో సమయం చాలావరకు ఆదా అయింది. ధ్రువీకరణ పత్రాల పరిశీలన, అభ్యర్థుల నేర చరిత్రపై ఆరా.. ప్రక్రియలన్నీ పూర్తయ్యాకే అభ్యర్థుల తుది జాబితా వెలువడనున్నట్లు తెలుస్తోంది.
ఎస్ఐ కీ విడుదల..

ఎస్ఐ, ఏఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన తుది రాత పరీక్షలు ఇటీవలే నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ పరీక్షలకు సంబంధించి ప్రాథమిక కీ విడుదల చేశారు.ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ లాంగ్వేజ్ పరీక్షలకు సంబంధించిన ఆబ్జెక్టివ్ పార్ట్ కు సంబంధించిన ప్రైమరీ కీ విడుదల చేశారు. ఈ ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఏప్రిల్ 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అధికారిక వెబ్‌సైట్లో తమ వ్యక్తి గత లాగిన్ ద్వారా సమర్పించాలని నియామక బోర్డు సూచించింది. అభ్యర్థులు తమ అభ్యంతరాలను డాక్యుమెంట్, పీడీఎఫ్, జేపీజీ రూపంలో వెబ్‌సైట్‌లో సమర్పించవచ్చు.
☛ TS SI Final Exam Telugu Question Paper With Preliminary Key 2023
☛ TS SI Final Exam Urdu Question Paper With Preliminary Key 2023
☛ TS SI Final Exam English Question Paper With Preliminary Key 2023
☛ TS SI Final Exam Question Paper With Key 2023: Arithmetic and Reasoning Exam QP With Key 2023
అందుకు సంబంధించిన ప్రొఫార్మాను తమ వ్యక్తిగత లాగిన్‌లో అందుబాటులో ఉంచారు. ఫైనల్ కీని విడుదల చేసిన తర్వాత అభ్యర్థుల ఓఎమ్మార్ షీట్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని అధికారులు పేర్కొన్నారు. మిగతా పేపర్లకు సంబంధించిన ప్రిలిమినరీ కీ వివరాలను త్వరలోనే విడుదల కానున్నాయి.
☛ Gandrathi Satish, SI: ఇంటర్, డిగ్రీలో ఫెయిల్..ఈ కసితోనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా..