Skip to main content

TS SI & Constable Result 2023 : ఎస్సై, కానిస్టేబుల్ ఫైన‌ల్ ఫలితాలు విడుదల.. మొత్తం ఎంత మంది అర్హ‌త సాధించారంటే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణలో పోలీస్‌ నియామక తుది రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఎస్ఐ, కానిస్టేబుల్ తుది రాత పరీక్షల్లో 84 శాతం మంది అర్హత సాధించినట్లు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు మే 30వ తేదీన (మంగళవారం) ప్రకటించింది.
TSLPRB Constable and SI Results 2023 declared
TS Constable and SI Results 2023

కానిస్టేబుల్‌ సివిల్‌, ట్రాన్స్‌పోర్టు, ఎక్సైజ్‌ పోస్టులకు 98,218 మంది, కానిస్టేబుల్‌ ఐటీ అండ్ కమ్యునికేషన్‌కు 4,564మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.

☛ TS Constable Final Exam Question Paper 2023 PDF : కానిస్టేబుల్‌ ఫైనల్‌ రాత పరీక్ష కొశ్చ‌న్ పేప‌ర్ ఇదే.. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే..

ఎస్సై ఉద్యోగాల‌కు మాత్రం..
సివిల్‌ ఎస్సై 43,708 మంది, ఐటీ అండ్ కమ్యునికేషన్‌ ఎస్సై పోస్టులకు 729 మంది, డ్రైవర్, ఆపరేటర్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు 1,779 మంది, ఫింగర్‌ ఫ్రింట్‌ బ్యూరో ఏఎస్సై పోస్టులకు 1,153 మంది, పోలీస్‌ ట్రాన్స్‌పోర్టు ఎస్సై పోస్టులకు 463 మంది, పోలీస్‌ కానిస్టేబుల్‌ మెకానిక్‌కు 283 మంది ఎంపికయినట్టు రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెలిపింది. మే 30వ తేదీ రాత్రి నుంచే అభ్యర్ధులు సాధించిన మర్కుల వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెలిపింది.

☛ టీఎస్ ఎస్సై, కానిస్టేబుల్ ఫైన‌ల్ ఫలితాలు-2023 కోసం క్లిక్ చేయండి 

➤☛ TS SI General Studies Question Paper With Key 2023 : TS SI Final Exam General Studies Question Paper ఇదే.. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే..

➤☛ TS SI Final Exam Question Paper With Key 2023 : TS SI Arithmetic and Reasoning & Mental Ability Exam కొశ్చ‌న్ పేప‌ర్ & ‘కీ’ ఇదే..

ఫైనల్ కీ కూడా విడుద‌ల‌..
పోలీస్ ఉద్యోగాల‌కు సంబంధించిన ఫైనల్‌ కీ, ఓఎంఆర్‌ షీట్లు వెబ్‌సైట్‌లో తమ వ్యక్తిగత లాగిన్‌లో చూసుకోవచ్చని పేర్కొంది.  రీకౌంటింగ్, రీ వెరిఫికేష‌న్‌కు అవకాశం క‌ల్పించారు. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్య‌ర్థులు రూ.2 వేలు, ఇత‌ర క‌మ్యూనిటీలు, నాన్ లోకల్ అభ్య‌ర్థులు రూ.3 వేలు చెల్లించి రీ కౌంటింగ్, రీవెరిఫికేష‌న్ చేసుకోవ‌చ్చ‌ని సూచించారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేష‌న్ ప్ర‌క్రియ జూన్ 1వ తేదీ ఉద‌యం 8 గంట‌ల నుంచి జూన్ 3వ తేదీ రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

టీఎస్ ఎస్సై, కానిస్టేబుల్ ఫైన‌ల్ ఫలితాల పూర్తి వివ‌రాల ఇవే..

Published date : 30 May 2023 08:25PM
PDF

Photo Stories