TS SI Final Selection list 2023 : ఎస్సై ఫలితాలు విడుదల.. పురుషులు, మహిళల ఎంపిక ఇలా.. తుది ఎంపిక జాబితా ఇదే..
ఎంపికైన అభ్యర్థుల జాబితా పోలీస్ నియామక మండలి వెబ్‌సైట్‌లో ఆగస్టు 7వ తేదీన (సోమవారం) ఉదయం నుంచి అందుబాటులో ఉంచింది. ఈ మేరకు పోలీసు నియామక మండలి చైర్మన్ వి.వి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించారు.
☛➤ టీఎస్ ఎస్సై, ఏఎస్సై పోస్టుల కటాఫ్ మార్కుల కోసం క్లిక్ చేయండి
☛➤ టీఎస్ ఎస్సై, ఏఎస్సై పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా కోసం క్లిక్ చేయండి
☛➤ టీఎస్ ఎస్సై, ఏఎస్సై పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
పురుషులు, మహిళల ఎంపిక ఇలా..
వివిధ విభాగాలకు చెందిన 587 ఉద్యోగాలకు 434 మంది పురుషులు, 153 మంది మహిళల్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎస్సై,ఏఎస్సై పోస్టులకు ఆగస్టు 7వ తేదీ నుంచి టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌లో కటాఫ్ మార్కుల కేటాయింపు, అభ్యర్థుల జన్మతేదీ వంటి వివరాలు వెల్లడిస్తామన్నారు.
ముఖ్యమైన తేదీలు.. కావాల్సిన పత్రాలు ఇవే..
శిక్షణకు ఎంపికైన అభ్యర్థులు ఆగస్టు 9 నుంచి 11 వరకు ఆన్‌లైన్‌లో ప్రత్యేక ఫార్మాట్‌లో వారిపై ఉన్న కేసులు, మెడికల్ అంశాల వివరాలు అటెస్టేషన్ చేయించాలని సూచించారు. అటెస్టేషన్ కాపీని ఏ4 సైజులో ప్రింట్ తీసి, వాటిపై పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు అంటించి మూడు కాపీల్లో గెజిటెడ్ అధికారితో సంతకాలు చేయించి వాటిని సూచించిన కేంద్రాల్లో ఆగస్టు 14 నాటికి అందజేయాలని పేర్కొన్నారు.
☛➤ ఇవీ చదవండి: జస్ట్ పది పాస్‌తో 30,041 ఉద్యోగాలు... నాలుగు గంటలే పని..
ఎంపిక ప్రక్రియలో సందేహాల నివృత్తికి సైతం నియామక మండలి అవకాశం కల్పించింది. ఆగస్టు 7వ తేదీ నుంచి 9 వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో సందేహాలు నివృత్తికి అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు ఎస్సీ, ఎస్టీలకు రూ.2వేలు, ఇతరులకు రూ.3వేలు ఆన్‌లైన్‌లో చెల్లించాలని బోర్డు అధికారులు పేర్కొన్నారు.
☛➤ చదవండి: టీఎస్‌పీఎస్సీ గ్రూప్-3 : స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్