TS SI & Constable Prelims Exams Results : ఎస్సై, కానిస్టేబుళ్ల ప్రిలిమినరీ రాత పరీక్ష 2022 ఫలితాలు ఈ వారంలోనే..?
అన్ని అనుకులంగా ఉంటే..ఈ వారంలోని ఈ ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది.
ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష కొశ్చన్ పేపర్ & ‘కీ’ కోసం క్లిక్ చేయండి
సెప్టెంబరులోనే..
ఆగస్టు 7వ తేదీన ఎస్సై, 28వ తేదీన కానిస్టేబుళ్ల పోస్టులకు నిర్వహించిన ఈ రాత పరీక్షల ఫలితాలను వాస్తవానికి సెప్టెంబరులోనే వెల్లడించాలని తొలుత పోలీసు నియామక మండలి నిర్ణయించింది. అయితే ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల్ని తగ్గిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రకటించడంతో టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వర్గాలు ముందుకెళ్లలేకపోయాయి. దీంతో ఫలితాల విడుదల ఆలస్యం అయ్యాయి.
కటాఫ్ మార్కులను యథాతథంగా..
కటాఫ్ మార్కులను బీసీ అభ్యర్థులకు 50కి.. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగ అభ్యర్థులకు 40కి తగ్గిస్తూ అక్టోబర్ 2వ తేదీన ఉత్తర్వులు వెలువడ్డాయి. ఓసీ అభ్యర్థుల కటాఫ్ మార్కులను యథాతథంగా 60గానే ఉంచాలని నిర్ణయించారు. ఈ ఉత్తర్వులతో తగ్గించిన కటాఫ్ మార్కులకు అనుగుణంగా ఫలితాల వెల్లడిపై మండలి కసరత్తు ముమ్మరం చేసింది.
చదవండి : TS Police Jobs Events: ఈవెంట్స్ కొట్టాలంటే.. ఇవి పాటించాల్సిందే..!
తెలంగాణలో భర్తీ చేయనున్న పోలీసు ఉద్యోగాలు ఇవే..
కానిస్టేబుల్ పోస్టుల వివరాలు ఇలా..
➤ కానిస్టేబుల్(సివిల్): 4965
➤ కానిస్టేబుల్(ఏఆర్): 4423
➤ కానిస్టేబుల్(ఎస్‌ఏఆర్‌సీపీఎల్)(పురుషులు): 100
➤ కానిస్టేబుల్(టీఎస్‌ఎస్పీ)(పురుషులు): 5010
➤ కానిస్టేబుల్ (స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్): 390
➤ ఫైర్‌మన్ (డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్): 610
➤ వార్డర్(పురుషులు)(జైళ్లు): 136
➤ వార్డర్(మహిళలు)(జైళ్లు): 10
➤ కానిస్టేబుల్(ఐటీ అండ్ కమ్యూనికేషన్స్): 262
➤ కానిస్టేబుల్(మెకానిక్స్)(పురుషులు): 21
➤ కానిస్టేబుల్(డ్రైవర్స్)(పురుషులు): 100
మొత్తం కానిస్టేబుల్ పోస్టులు: 16,027
Police Jobs: తెలంగాణ పోలీసు ఉద్యోగాలకు సిలబస్ ఇదే.. ఇలా చదివితే..
ఎస్సై పోస్టుల వివరాలు ఇవే..
☛ సబ్ ఇన్‌స్పెక్టర్(సివిల్): 414
☛ సబ్ ఇన్‌స్పెక్టర్(ఏఆర్): 66
☛ సబ్ ఇన్‌స్పెక్టర్(ఎస్‌ఏఆర్ సీపీఎల్)(పురుషులు): 5
☛ సబ్ ఇన్‌స్పెక్టర్(టీఎస్‌ఎస్పీ)(పురుషులు): 23
☛ సబ్ ఇన్‌స్పెక్టర్(స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్)(పురుషులు): 12
☛ స్టేషన్ ఫైర్ ఆఫీసర్(డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్): 26
☛ డిప్యూటీ జైలర్(పురుషులు): 8
☛ సబ్ ఇన్‌స్పెక్టర్(ఐటీ అండ్ కమ్యూనికేషన్స్): 22
☛ సబ్ ఇన్‌స్పెక్టర్(పోలీస్ ట్రాన్స్‌పోర్ట్)(పురుషులు): 3
☛ సబ్ ఇన్‌స్పెక్టర్(ఫింగర్ ప్రింట్ బ్యూరో): 8
మొత్తం ఎస్సై పోస్టులు: 587