Skip to main content

TS SI & Constable Prelims Exam Results 2022 link : ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాత ప‌రీక్ష‌ ఫలితాలు విడుదల.. ఎంత మంది పాస్ అయ్యారంటే..

సాక్షి ఎడ్య‌కేష‌న్ : తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఇటీవల నిర్వహించిన ఎస్సై, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష 2022 ఫలితాలను అక్టోబ‌ర్ 21వ తేదీన విడుద‌ల చేసింది.

అభ్యర్థులు మొబైల్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చని పోలీసు నియామక సంస్థ తెలిపింది.

టీఎస్ ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాత ప‌రీక్ష 2022 ఫలితాల కోసం క్లిక్ చేయండి

ఎంత మంది పాస్ అయ్యారంటే..?
సివిల్‌ ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలో 46.80 శాతం, సివిల్‌ కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్షలో 31.40శాతం, రవాణా కానిస్టేబుల్‌ పరీక్షలో 44.84శాతం, ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌  పరీక్షలో 43.65శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొంది. పోలీస్‌ సివిల్‌ విభాగంలో 15,644, ఆబ్కారీశాఖలో 614, రవాణాశాఖలో 63 కానిస్టేబుల్‌ పోస్టుల కోసం 1601 కేంద్రాల్లో ప్రాథమిక పరీక్ష నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే. ఈ ప‌రీక్ష‌కు మొత్తం 6,61,198 మంది దరఖాస్తుదారులకుగాను 6,03,955 (91.34శాతం) మంది హాజరయ్యారు.

తెలంగాణ పోలీసు ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి 

ఎస్‌ఐ ప్రిలిమ్స్ రాత ప‌రీక్ష‌ను ఆగస్టు 7న తేదీన‌ నిర్వహించిన విషయం తెలిసిందే. అలాగే ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్స్ పోస్టులకు ఆగస్టు 28న పోలీసు నియామక మండలి పరీక్ష నిర్వహించింది. 

క‌టాప్ మార్కులు ఇలా..
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టుల రాత పరీక్షల కటాఫ్‌ మార్కులను ప్రభుత్వం సవరించింది. 200 మార్కులకుగాను 60 మార్కులు ఓసీలకు, 50 బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు 40 మార్కులు ఉంటాయని పేర్కొంది.

ఎస్సై ప్రిలిమినరీ ప‌రీక్ష కొశ్చ‌న్ పేప‌ర్ & ‘కీ’  కోసం క్లిక్ చేయండి

తెలంగాణలో భర్తీ చేయనున్న పోలీసు ఉద్యోగాలు ఇవే..
కానిస్టేబుల్‌ పోస్టుల వివరాలు ఇలా..
➤ కానిస్టేబుల్‌(సివిల్‌): 4965
➤ కానిస్టేబుల్‌(ఏఆర్‌): 4423
➤ కానిస్టేబుల్‌(ఎస్‌ఏఆర్‌సీపీఎల్‌)(పురుషులు): 100
➤ కానిస్టేబుల్‌(టీఎస్‌ఎస్పీ)(పురుషులు): 5010
➤ కానిస్టేబుల్‌ (స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌): 390
➤ ఫైర్‌మన్‌ (డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌): 610
➤ వార్డర్‌(పురుషులు)(జైళ్లు): 136
➤ వార్డర్‌(మహిళలు)(జైళ్లు): 10
➤ కానిస్టేబుల్‌(ఐటీ అండ్‌ కమ్యూనికేషన్స్‌): 262
➤ కానిస్టేబుల్‌(మెకానిక్స్‌)(పురుషులు): 21
➤ కానిస్టేబుల్‌(డ్రైవర్స్‌)(పురుషులు): 100
మొత్తం కానిస్టేబుల్‌ పోస్టులు: 16,027 

Police Jobs: తెలంగాణ పోలీసు ఉద్యోగాలకు సిలబస్‌ ఇదే.. ఇలా చదివితే..

ఎస్సై పోస్టుల వివరాలు ఇవే..

TS SI Posts


☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(సివిల్‌): 414
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఏఆర్‌): 66
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌)(పురుషులు): 5
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(టీఎస్‌ఎస్పీ)(పురుషులు): 23
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌)(పురుషులు): 12
☛ స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌(డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌): 26
☛ డిప్యూటీ జైలర్‌(పురుషులు): 8
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఐటీ అండ్‌ కమ్యూనికేషన్స్‌): 22
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌)(పురుషులు): 3
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరో): 8
మొత్తం ఎస్సై పోస్టులు: 587

చ‌ద‌వండి : TS Police Jobs Events: ఈవెంట్స్ కొట్టాలంటే.. ఇవి పాటించాల్సిందే..!

ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాత ప‌రీక్ష 2022 ఫలితాల స‌మ‌గ్ర స‌మాచారం ఇలా..

Published date : 22 Oct 2022 08:31AM
PDF

Photo Stories