నూతన విద్యా విధానంతో ‘శాస్త్ర, సాంకేతిక’ అభివృద్ధి
Sakshi Education
దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధికి నూతన విద్యా విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని.. దీన్ని సమర్థవంతంగా అమలు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సూచించారు.
తిరుపతి ఎస్వీయూ ఆడిటోరియంలో మార్చి 22న నూతన విద్యా విధానంపై జాతీయ సదస్సు నిర్వహించారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వర్చువల్ విధానంలో ప్రసంగించారు. ఏబీఆర్‌ఎస్‌ఎమ్ జాతీయ అధ్యక్షుడు జేపీ సింఘాల్ మాట్లాడుతూ.. నూతన విద్యా విధానం భారత్‌ను విశ్వగురువును చేస్తుందనడంలో సందేహం లేదన్నారు. ఎస్వీయూ, పద్మావతి మహిళా వర్సిటీ వీసీలు ఆచార్య కె.రాజారెడ్డి, ఆచార్య దువ్వూరి జమున మాట్లాడుతూ.. నూతన విద్యా విధానంలో పాఠ్య ప్రణాళికలను పూర్తిగా విద్యార్థులకు అనుగుణంగా రూపొందించారని వివరించారు. సదస్సులో వివిధ వర్సిటీల వీసీలు, అధ్యాపకులు పాల్గొన్నారు.
Published date : 23 Mar 2022 12:47PM