డిగ్రీ విద్యార్థులకు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి తరగతులు మొదలవుతాయని తెలంగాణ ఉన్నత విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు.
డిగ్రీ తరగతులు ప్రారంభ తేదీ వివరాలు..
దోస్త్ ద్వారా సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు సంబంధిత కాలేజీల్లో భౌతికంగా రిపోర్టు చేయాలని సెప్టెంబర్ 27న ఓ ప్రకటనలో సూచించారు. లేని పక్షంలో కేటాయించిన సీటు రద్దవుతుందని స్పష్టంచేశారు.