CHSE: ప్లస్–2 వార్షిక పరీక్షలు తేదీలు ఇవే..
2023–24 విద్యా సంవత్సరం క్యాలెండర్ ప్రకారం 2024 ఫిబ్రవరి 14వ తేదీ నుంచి మార్చి 13వ తేదీ మధ్య ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఫలితాలు ఏప్రిల్ చివరి వారం లేదా మే మొదటి వారంలో వెల్లడిస్తారు.
కీలకమైన తేదీలు
పరీక్షల కోసం ఎక్స్ రెగ్యులర్ విద్యార్థులు ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. అదేవిధంగా రెగ్యులర్ విద్యార్థులు నవంబర్ 10వ తేదీ నుంచి 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని. వార్షిక హయ్యర్ సెకండరీ పరీక్షల అడ్మిట్ కార్డ్ ఆన్‌లైన్‌లో జారీ అవుతుంది. 2023 డిసెంబర్ 25వ తేదీ నాటికి అడ్మిట్ కార్డు సిద్ధమవుతుంది.
చదవండి: MLA : పాఠశాలల్లో మౌలిక వసతులకు ప్రాధాన్యం
ప్రాక్టికల్ పరీక్షలు
2023 డిసెంబర్ 22వ తేదీ నాటికి సీహెచ్‌ఎస్‌ఈ వెబ్‌సైట్‌లో ప్రాక్టికల్ ఎగ్జామ్స్–24 ఎగ్జామినర్ల జాబితాను అప్‌లోడ్ చేస్తుంది. 2024 జనవరి మొదటి వారంలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ దశ పరీక్షలు ముగిసిన అనంతరం రాత (థియరీ) పరీక్షలు ప్రారంభిస్తారు. 2024 ఫిబ్రవరి 14వ తేదీ నుంచి మార్చి 13వ తేదీ మధ్య వార్షిక థియరీ పరీక్షలు జరుగుతాయి.
చదవండి: Education Department: టీచర్ల సర్దుబాటు షురూ
సకాలంలో ఫలితాలు
వార్షిక పరీక్షలు నిర్ధారిత సమయంలో అవకతవకలు లేకుండా నిర్వహించి, అనంతర కార్యాచరణలో పారదర్శకత పరిరక్షణతో సకాలంలో ఫలితాల ప్రచురించేందుకు కార్యాచరణ ఖరారైంది. ప్లస్–2 పరీక్షల ఫలితాలు 2024 ఏప్రిల్ చివరి వారం లేదా మే మొదటి వారంలో ప్రచురిస్తారు. వెంటనే ఇన్‌స్టంట్ పరీక్ష నిర్వహణ సన్నాహాలు ఊపందుకుంటాయి. ఈ పరీక్షలు రాసే అభ్యర్థులు 2024 మే 3వ వారంలో దరఖాస్తు దాఖలు చేయాల్సి ఉంటుంది. జూన్ 2వ వారంలో ఇన్‌స్టంట్ పరీక్షలు నిర్వహిస్తారు.