Skip to main content

MLA : పాఠశాలల్లో మౌలిక వసతులకు ప్రాధాన్యం

Priority for infrastructure in schools

అడ్డతీగల: పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నట్టు రంపచోడవరం ఎమ్మెల్యే నాగులిపల్లి ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంతబాబు చెప్పారు. మండల కేంద్రంలోని ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో అదనపు భవన నిర్మాణానికి వారు బుధవారం భూమిపూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో అదనపు భవనం కోసం ఐటీడీఏ రూ.5లక్షలు నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విద్యాభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌కు దీటుగా మౌలిక సదుపాయాలతో రూపుదిద్దుకుంటున్నాయన్నారు. గిరిజన విద్యార్థులు విద్య పరంగా మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రొత్సహించేందుకు మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. అనంతరం రాజుంపాలెంలో జీపీఎస్‌ పాఠశాలలో రూ.24లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న అదనపు భవన నిర్మాణానికి భూమిపూజ చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అందుబాటులో ఉన్న వసతులను వినియోగించుకుని విద్యార్థుల మంచి ఫలితాలు సాధించి ఉన్నత స్థితికి చేరుకోవాలన్నారు. రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బత్తుల సత్యనారాయణ, వైస్‌ ఎంపీపీ కరణం వీరవెంకట సత్యనారాయణ, అడ్డతీగల ఎంపీటీసీ వడ్లమూరి రత్నం, సర్పంచ్‌ పప్పుల చిట్టమ్మ పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

చదవండి: Dadi Ratnakar: ప్రతి విద్యార్థి విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలి

Published date : 17 Aug 2023 03:26PM

Photo Stories