Dadi Ratnakar: ప్రతి విద్యార్థి విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలి
అనకాపల్లిటౌన్ : ప్రతి విద్యార్థి విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్ అన్నారు. విశాఖ ఉమ్మడి జిల్లా రోలర్ స్కేటింగ్ పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. తల్లిదండ్రులు కూడా క్రీడల పట్ల ఆసక్తి కనబరిచి తమ పిల్లలను ప్రోత్సహించాలని సూచించారు. తద్వారా వారిలో పోటీతత్వం పెరిగి ఉన్నతస్థాయి క్రీడాకారులుగా ఎదుగుదలకు దోహదపడుతుందని చెప్పారు. విద్యార్థులు క్రీడల్లో ఉన్నత స్థాయికి ఎదిగినట్లయితే స్పోర్ట్స్ కోటాలో అదనపు మార్కులు కలిిసి మంచి సంస్థల్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉందన్నారు. క్రీడాకారులకు మానసిక, శారీరక దృఢత్వంతో పాటు గెలుపోటములు తట్టుకునే ఆత్మస్థైర్యం ఉండాలన్నారు. ఈ పోటీల్లో ఆర్‌ఆర్‌ఎస్ క్లబ్ తరఫున హాజరైన ముగ్గురు విద్యార్థినులు ఎంబీబీఎస్ సీట్లు సాధించడం అభినందనీయమన్నారు. 450 మంది క్రీడాకారులు ఈ చాంపియన్‌షిప్‌లో పాల్గొనగా విశాఖకు చెందిన వోక్‌వ్యాలీ స్కూల్ టీం చాంపియన్‌షిప్ సాధించింది. కశింకోటకు చెందిన సెయింట్‌జాన్స్ స్కూల్ రన్నర్స్‌గా నిలిచింది. స్థానిక లక్ష్మీనారాయణనగర్ స్కేటింగ్ పార్కు వద్ద యూనిక్ రోలర్ స్కేటింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విజేతలకు ఆయన బహుమతులు, ట్రోఫీలు అందజేశారు. వివిధ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలకు ఆయనతో కార్పొరేటర్లు కొణతాల నీలిమ, పీలా లక్ష్మీసౌజన్య బహుమతులు అందించారు. పోటీల నిర్వాహకులైన బీవీ రామకృష్ణ, కోచ్ శ్యామ్‌లను రత్నాకర్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వార్డుల ఇన్‌చార్జిలు కొణతాల భాస్కర్, పీలా రాంబాబు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ శిలపరశెట్టి బాబీ, పార్టీ నేతలు బొడ్డపాటి చినరాజారావు, ఆళ్ల ప్రవీణ్, పీఎస్‌కే నాయుడు, మొల్లి రమణబాబు, పలకా కాసులు, కోటిపల్లి శ్రీను, కోచ్‌లు రాంజీ, ఎస్‌కే నాయుడు, ప్రసన్న, లహరి, శ్రీకాంత్, సురేష్, యల్లాజీ పాల్గొన్నారు.
చదవండి: ZP High School: పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా