Skip to main content

FA-2 Exams for Students: విద్యార్థుల‌కు ఫార్మేటివ్ అసెస్మెంట్ ప‌రీక్ష‌ల ఏర్పాట్లు సిద్ధం

పాఠ‌శాల‌లో విద్యార్థుల‌కు ఎఫ్ఏ-2 ప‌రీక్ష‌లు ప్రారంభం అయ్యాయి. ఈ నేప‌థ్యంలోనే విద్యాశాఖ వారు ప‌రీక్ష‌లు నిర్వ‌హించే విధానాన్ని ప్ర‌కట‌న‌లో వివ‌రించారు. ప‌రీక్ష‌ల తేదీలు, వాటికి కేటాయించిన స‌మ‌యాన్ని స్ప‌ష్టించారు. ఆ వివ‌రాల‌ను ప‌రిశీలించండి..
Formative assessment exams for Students at schools
Formative assessment exams for Students at schools

సాక్షి ఎడ్యుకేష‌న్: విద్యార్థుల విద్యా స్థాయిని తెలుసుకునేందుకు ఏటా నాలుగు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌, రెండు సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలను నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే రెండో ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షను మంగళవారం నుంచి కోనసీమ జిల్లా వ్యాప్తంగా నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ పరీక్షలు 6వ తేదీ వరకు జరుగుతాయి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ యాజమాన్యాల పరిధిలో 1–10 తరగతుల విద్యార్థులు రాష్ట్ర విద్యా పరిశోధన మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) రూపొందించిన ఉమ్మడి పరీక్షాపత్రం ద్వారానే పరీక్షలు రాయనున్నారు. 1–5 తరగతుల విద్యార్థులకు ఉదయం, మధ్యాహ్నం ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తారు. 6–8 తరగతులకు మధ్యాహ్నం, 9 ఇంక 10 తరగతులకు ఉదయం పరీక్షలు ఉంటాయి.

Development of Gurukul Schools: గురుకుల విద్యార్థుల‌కు మౌలిక సౌకర్యాలు

ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి 10.30 వ‌ర‌కు, మధ్యాహ్నం 1.20 నుంచి 2.20 గంటల వరకు. 3, 4, 5 తరగతులకు ఇంగ్లిష్‌ పార్ట్‌–బి మధ్యాహ్నం 2.30 నుంచి 2.50 గంటల వరకు, 6–8 తరగతులకు మధ్యాహ్నం 1.10 నుంచి 2.10 గంటల వరకు ఒక పరీక్ష, 2.20 నుంచి 3.20 గంటల వరకు మరో పరీక్ష, ఇంగ్లిష్‌ పార్ట్‌–బి మాత్రం 3.30 గంటల నుంచి 3.50 గంటల వరకు మాత్ర‌మే నిర్వహిస్తారు. 9, 10 తరగతులకు ఉదయం 9.30 నుంచి 10.15, రెండో పరీక్షకు ఉదయం 10.30 నుంచి 11.15 గంటల వరకు స‌మ‌యాని కేటాయిస్తారు. ఇంగ్లిష్‌ పార్ట్‌–బి మాత్రం ఉదయం 11.30 గంటల నుంచి 11.50 గంటల వరకు నిర్వహించనున్నారు. 

Sports Education: వ్యాయామ విద్య‌లో ప్రోత్సాహానికి వాలీబాల్ పోటీలు

ప్ర‌శ్నాప‌త్రాల త‌యారి..

ప్రశ్నపత్రాన్ని బ్లాక్‌ బోర్డుపై ఉపాధ్యాయులు రాయగా, విద్యార్థులు పేపరును నమోదు చేసుకుని, సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అన్ని మేనేజ్‌మెంట్ల హెచ్‌ఎంకు పరీక్ష పేపర్లను మెయిల్‌లో పంపిస్తారు. ఆ పేపర్లను డౌన్‌లోడ్‌ చేసుకుని, పరీక్షలను నిర్వహించాలి. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 1,580 ప్రభుత్వ, ఎయిడెడ్‌, 456 ప్రైవేట్‌ యాజమాన్యం పరిధిలోని పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న 2,02,532 మంది విద్యార్థులు ఎఫ్‌ఏ–2 పరీక్షలకు సన్నద్ధమయ్యారు.

Formative Assessment-2: పాఠ‌శాల విద్యార్థుల‌కు ఎఫ్ఏ-2 ప‌రీక్ష‌లు మొద‌లు

Published date : 03 Oct 2023 12:48PM

Photo Stories