Development of Gurukul Schools: గురుకుల విద్యార్థులకు మౌలిక సౌకర్యాలు
సాక్షి ఎడ్యుకేషన్: రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్ కార్యదర్శి ఆర్.పావనమూర్తి అన్నారు. అల్లవరం మండలం గోడిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలురు, బాలికల గురుకులాలను గురువారం ఆయన సందర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 190 గురుకులాల్లో మౌలిక సౌకర్యాలు, విద్యార్థులకు భోజనాలు, ఇతర సదుపాయాల కల్పనకు ఏడాదికి రూ.800 ఖర్చు చేస్తున్నామని చెప్పారు. గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా సీబీఎస్‌ఈ పరీక్షలను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తామన్నారు.
Don't use newspapers to pack food: న్యూస్ పేపర్‌లో ఆహార పదార్థాల ప్యాకింగ్ వద్దు
గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల విదేశీ విద్యకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. గురుకులాల్లో చదివిన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందన్నారు. గురుకులాల్లో చదివే విద్యార్థులు మంచిగా చదివి ర్యాంకులు సాధించాలని సూచించారు. గురుకుల విద్యార్థులు ఐఐటీలో సీట్లు సాధించారని ప్రిన్సిపల్ కార్యదర్శి తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సూచించారు. విద్యార్థులను ఆ దిశగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషించాలని సూచించారు.
Football Competitions: జిల్లాస్థాయిలో గెలిచి రాష్ట్ర స్థాయిలో పోటీ
గోడి గురుకులాల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని, వర్షం నీరు నిల్వ ఉండకుండా పల్లపు ప్రాంతాన్ని మెరక చేస్తామన్నారు. ఆయన వెంట డీసీఓ సంజీవరావు, డీఈఈ సుబ్బరాజ్, పీఆర్ డీఈ రాజ్‌కుమార్, ఏఈఈ రాధాకృష్ణ, ఏఈ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ శ్యామ్‌ప్రసాద్, కోట హనుమంతరావు పాల్గొన్నారు.