Skip to main content

Sports Education: వ్యాయామ విద్య‌లో ప్రోత్సాహానికి వాలీబాల్ పోటీలు

పాఠ‌శాలలో విద్యార్థుల‌కు చ‌దువు ఎంత ముఖ్య‌మో, దానితోపాటు వ్యాయామ విద్య కూడా అంతే ముఖ్యం అని జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు. క్రీడ‌ల్లో విద్యార్థులంతా త‌మ ప్ర‌తిభ‌ను చూపించాల‌ని, వాలీబాల్ పోటీలను నిర్వ‌హిస్తున్నారు..
DEO and Sports teachers appreciating sports students,Physical education importance in schools
DEO and Sports teachers appreciating sports students

సాక్షి ఎడ్యుకేష‌న్: గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్‌ ప్రేమ్‌ కుమార్‌ సూచించారు. ఈ మేరకు మండలకేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో బాల, బాలికలకు జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యను ప్రోత్సహిస్తున్నంతగా వ్యాయామ విద్యను వ్యాయామ ఉపాధ్యాయులు పోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

Sports Competitions: జిల్లాస్థాయి నుంచి రాష్ట్రస్థాయి రోల్‌బాల్ పోటీల‌కు ఎంపిక‌

సీతానగరం ఉన్నత పాఠశాలకేంద్రంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఉన్నత పాఠశాలలకు చెందిన 210 మంది క్రీడాకారులు అండర్‌ 17 స్థాయిలో పోటీల్లో పాల్గొన్నారని తెలియజేశారు. జిల్లాస్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో జరగనున్న పోటీలలో పాల్గొంటారని తెలియజేశారు. ఎంఈఓ జి.సూరిదేముడు మాట్లాడుతూ విద్యార్థుల్లో విద్యతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించడానికి, శరీర ఆరోగ్యపరిరక్షణకు క్రీడలు దోహద పడతాయన్నారు. విద్యార్ధులు క్రీడలపట్ల ఆసక్తి చూపడం మంచిపరిణామమని అభినందించారు. కార్యక్రమం లో ఉమ్మడి జిల్లాలోని ఉన్నత పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Published date : 30 Sep 2023 12:43PM

Photo Stories