Sports Competitions: జిల్లాస్థాయి నుంచి రాష్ట్రస్థాయి రోల్‌బాల్ పోటీలకు ఎంపిక
Sakshi Education
రోల్‌బాల్ పోటీలకు తేదీని విడుదల చేశారు. ఈ పోటీలను రాష్ట్ర స్థాయిలో నిర్వహించేందుకు ఈ పోటీల్లో విద్యార్థులను ఎంపిక చేస్తామన్నారు. పోటీ జరిగే తేదీ, తదితర వివరాలను పరిశీలించండి..
State level selection in district level
సాక్షి ఎడ్యుకేషన్: జిల్లాస్థాయి స్కూల్‌గేమ్స్ రోల్‌బాల్ ఎంపిక పోటీలు అక్టోబర్ ఒకటో తేదీన జరగనున్నాయని జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షులు, డీఈఓ కె.వెంకటేశ్వరరావు, కార్యదర్శి బీవీ రమణ తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి జిల్లాలోని పలాస ఉన్న స్కేటింగ్ రింక్‌లో అండర్–14, అండర్–17, అండర్–19 బాలబాలికల ఎంపికలు వేర్వేరుగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
ఇక్కడ ఎంపిక చేసిన జిల్లా జట్లను త్వరలో జరిగే రాష్ట్రపోటీలకు పంపించనున్నట్టు చెప్పారు. ఎంపికలకు హాజరయ్యే బాలబాలికలు తమ జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, స్టడీ సర్టిఫికెట్‌తో హాజరుకావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9290905399, 9705462218 నంబర్లను సంప్రదించాలని వారు కోరారు.