సృజనాత్మకతే సమస్యకు పరిష్కారం: శ్రీచైతన్య
![creativity is the solution to the problem sri chaitanya school](/sites/default/files/images/2023/03/25/1-1-1679749745.jpg)
హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో శ్రీచైతన్య విద్యాసంస్థలకు చెందిన 70 క్యాంపస్‌ల నుంచి దాదాపు వెయ్యి మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకటి నుంచి అయిదో తరగతికి చెందిన విద్యార్థులు.. ఇంగ్లీషు భాషలో సృజనాత్మకంగా కథ చెప్పడమే ఈ పోటీ. నారాథాన్‌లో భాగంగా నరేట్ చేయడంపై పిల్లలు దృష్టి పెట్టేలా ఈ పోటీని రూపొందించారు. ఇందులో క్యాంపస్ లెవల్‌తో పాటు జోన్ లెవల్, స్టేట్ లెవల్ పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులందించారు. దీంతో పాటు విద్యార్థులకు అబాకస్ పోటీలు కూడా నిర్వహించారు.
![sri chaitanya](/sites/default/files/inline-images/2-2.jpg)
చదవండి: Skill Training: విదేశాల్లోనూ ఉపాధికి ‘స్కిల్’ శిక్షణ
లెక్కలను వేగంగా చేయడం, షార్ట్ కట్‌లో సమాధానాలు కనుక్కోవడం, సులువుగా పరిష్కరించడం దీని లక్ష్యం. చిన్న వయస్సులో అబాకస్‌తో శిక్షణ తీసుకుంటే... అది భవిష్యత్తులో కాంపిటీటీవ్ పరీక్షలు రాసేపుడు ఉపయోగపడతాయని శ్రీచైతన్య ఉపాధ్యాయులు వివరించారు. నారాథన్, అబాకస్‌తో పాటు డ్రాయింగ్‌లో కూడా ఫైనల్ పోటీలు నిర్వహించి, విజేతలకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో శ్రీచైతన్య అకాడమిక్ డైరెక్టర్ సీమ, IMA హైదరాబాద్ బ్రాంచ్ అధ్యక్షులు దయాల్ సింగ్, ఇండ్‌ఫ్లేమ్ సీఈవో గీతా భాస్కర్, సినిమా హీరో కిరణ్ అబ్బవరం, సీఐడీ డీఎస్పీ శివన్నాయుడు, క్రికెటర్ త్రిష, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, వివిధ క్యాంపస్ రీజినల్ ఇన్‌ఛార్జ్‌లు అనిత, పద్మజ తదితరులు పాల్గొన్నారు.
![sri chaitanya](/sites/default/files/inline-images/3-3.jpg)
చదవండి: Award: బడిపిల్లల సాహిత్యానికి రాష్ట్రస్థాయి పురస్కారం