Collector P Pravinya: స్వీప్ యాక్టివిటీస్‌లో విద్యార్థులకు పోటీలు
అందుకోసం వారికి పలు పోటీలను నిర్వహించి బహుమతులను అందించనున్నట్లు పేర్కొన్నారు. స్కిట్ పోటీలకు 9 నుంచి 12వ తరగతి చదువుతున్న వారు ఒక కేటగిరీ, డిగ్రీ ఆపైన చదువుతున్న వారు ఒక కేటగిరీ గా నామినేషన్లు తీసుకోనున్నట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొంటున్న వారి స్కిట్, వీధి నాటకాలు.. యువ, పట్టణ ఓటర్లు ఎక్కువగా ఓటింగ్‌లో పాల్గొనేలా, ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా, నైతికంగా ఓటువేసే విధంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసే విధానాలపై అవగాహన కలిగించేవిగా ఉండాలన్నారు.
ఇలా వచ్చిన స్కిట్‌లలో జిల్లా స్థాయిలో మొదటి బహుమతికి రూ.10 వేలు, రెండో బహుమతికి రూ.8 వేలు, మూడో బహుమతికి రూ.5 వేలతోపాటు సర్టిఫికెట్లు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ స్కిట్‌లు తెలుగు, హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ భాషలో దేనిలోనైనా చేయవచ్చని చెప్పారు. జిల్లా స్థాయిలో ఎంపికై న స్కిట్‌లను రాష్ట్ర స్థాయికి పంపిస్తామని, రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతికి రూ.20 వేలు, ద్వితీయ బహుమతికి రూ.15 వేలు, తృతీయ బహుమతికి రూ.12 వేలతో పాటు సర్టిఫికెట్లు అందజేస్తారని తెలిపారు.
చదవండి: దేశ జనన, మరణాల రిజిస్టర్‌ను ఓటర్ల జాబితాతో అనుసంధానం?
సెప్టెంబర్ 18వ తేదీలోగా స్కిట్‌కి సంబందించిన ఫొటోలు, వీడియోలను అసిస్టెంట్ స్వీప్ నోడల్ అధికారి, జిల్లా సైన్స్ అధికారి 98488 78455 నంబర్‌కు వాట్సాప్ పంపించాలన్నారు. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు పద్యాలు, కవితలు, పాటల రచన పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతికి రూ.ఐదువేలు, సర్టిఫికెట్, ద్వితీయ బహుమతికి రూ.నాలుగు వేలు, సర్టి ఫికెట్, తృతీయ బహుమతికి రూ.3 వేలు, సర్టిఫికెట్ ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతికి రూ.10 వేలు, సర్టిఫికెట్, ద్వితీయ బహుమతికి రూ.8 వేలు, సర్టిఫికెట్, తృతీయ బహుమతికి రూ.ఐదు వేలు, సర్టిఫికెట్ ఇస్తారని తెలిపారు. 9, 10వ తరగతి విద్యార్థులు తమ రచనలను స్కూల్ హెడ్‌మాస్టర్, ఇంటర్ విద్యార్థులు తమ కళాశాల ప్రిన్సిపాల్‌కు సెప్టెంబర్ 18లోపు పంపాలని కలెక్టర్ సూచించారు.
చదవండి: Election Commission: దేశంలోని ఓటర్ల సంఖ్య 94.5 కోట్లు