Coding and Programming Course: సర్టిఫికెట్ కోర్సులు వినియోగించుకోండి
కరీంనగర్‌లోని ఎస్సారార్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో శాంసంగ్ కంపెనీ, తెలంగాణ స్కిల్స్, నాలెడ్జి సెంటర్ ఆధ్వర్యంలో కోడింగ్ అండ్ ప్రోగ్రామింగ్ సర్టిఫికేషన్ కోర్సు రెండో బ్యాచ్ విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె.రామకృష్ణ తెలిపారు. కళాశాలలోని సర్టిఫికెట్ కోర్సులను వినియోగించుకోవాలని కోరారు. టీఎస్‌కేసీ కో–ఆర్డినేటర్ సీహెచ్.మారుతి మాట్లాడుతూ.. విద్యార్థులు కంప్యూటర్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై అవగాహన పెంచుకుంటే అనేక రకాల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
చదవండి: Coding School: గాడితప్పిన ‘కోడింగ్ స్కూల్’!
వి బిలీవ్ కన్సల్టింగ్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ జ్ఞానేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కోర్సు అనంతరం ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలిపారు. కె.సురేందర్ రెడ్డి, జీసీజీటీఏ ప్రధాన కార్యదర్శి, ఐ క్యూఏసీ కో–ఆర్డినేటర్ ఎస్.ఓదెలుకుమార్, కను ప్రియ, ప్రాజెక్టు మేనేజర్ సీఎస్ ఆర్ సామ్‌సాంగ్, రీజినల్ మేనేజర్ లాలూ ధరావత్, ఎలక్ట్రానిక్ కౌన్సిల్ అజీజ్, మేనేజర్, వి బిలీవ్ కన్సల్టెన్సీ సర్వీసెస్, కంప్యూటర్, అధ్యాపకులు, టీఎస్‌కేసీ మెంటర్ రాజశేఖర్, విద్యార్థులు పాల్గొన్నారు.