National Children's Science Congress 2023: పిల్లలను పరిశోధనల వైపు ప్రోత్సహించాలి
నవంబర్ 29న స్థానిక వడ్డేశ్వరం కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక మండలి, గుంటూరు జిల్లా విద్యాశాఖ, కేఎల్‌యూలు సంయుక్తంగా రెండు రోజులపాటు నిర్వహిస్తున్న 31వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ 2023 కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి మెంబర్ సెక్రటరీ డాక్టర్ వై.అపర్ణతో కలసి గుంటూరు జిల్లా విద్యాధికారిణి పి.శైలజ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ ఈ కార్యక్రమం పిల్లల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందన్నారు. సూక్ష్మస్థాయిలో చేసే చిన్నచిన్న పరిశోధనలే పెద్దపెద్ద విజయాలకు దారితీస్తాయన్నారు. హేతుబద్ధ శాసీ్త్రయ అన్వేషణ సంస్కృతిని పిల్లలకు అలవాటు చేయడానికి బాలల జాతీయ సైన్స్ కాంగ్రెస్ ఉపయోగపడుతుందని అన్నారు. సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి విద్యావ్యవస్థలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారన్నారు.
చదవండి: YS Jagan Mohan Reddy: పేదింటి పిల్లలు ప్రపంచాన్ని ఏలాలి
విద్యార్థుల ప్రయోజనాల కోసం జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ 1933 సంవత్సరంలో గ్వాలియర్‌లో ప్రారంభించబడి జాతీయస్థాయి ప్రతిష్టాత్మకమైన ఈవెంట్‌గా ఎదిగిందన్నారు. ఏపీలోని 26 జిల్లాల నుంచి జిల్లాకు ఏడు ప్రాజెక్టుల చొప్పున 182 ప్రాజెక్టులు రావడం జరిగిందని, వీటిలో ఉత్తమమైన 17 ప్రాజెక్టులను జాతీయ సైన్స్ కాంగ్రెస్ పోటీలకు పంపడం జరుగుతుందన్నారు.
యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ జి.పార్థసారఽథి వర్మ మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల దశ నుంచే స్థానిక సమస్యల పరిష్కారం కోసం ప్రాజెక్టులను రూపొందించాలని సూచించారు. ప్రాజెక్టుల తయారీలో శాసీ్త్రయ అంశాలైన పరిశీలన, సమాచార సేకరణ, ప్రయోగాలు, సమస్యల పరిష్కార మార్గాలు, అవగాహన, సృజనాత్మకత, వినూత్న ఆలోచనలు కలిగిన ఉత్తమ సైన్స్ ప్రాజెక్టులను రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపిక చేస్తారన్నారు. విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా వినయ విధేయతలు కలిగి ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి మెంబర్ సెక్రటరి డాక్టర్ వై. అపర్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో 26 జిల్లాల నుంచి బాల శాస్త్రవేత్తలు 182 మంది, గైడ్ టీచర్స్ 78 మంది, డిస్ట్రిక్ట్ కో–ఆర్డినేటర్స్ డిస్ట్రిక్ట్ అకడమిక్ కో–ఆర్డినేటర్స్ 52 మంది, ఎవల్యూఏటర్స్ 21 మంది, ఆర్గనైజర్స్ 30 మంది, వలంటీర్లు 40 మంది, తదితరులతో మొత్తం 500 మంది సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొంటున్నట్లు తెలిపారు. జిల్లాస్థాయిలో పోటీలలో నాలుగువేల ప్రాజెక్టులను ప్రదర్శించగా వాటిలో జిల్లాకు 7 చొప్పున 182 ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్టు పేర్కొన్నారు.
రెండు రోజుల ప్రదర్శనలో జిల్లాకు ఒకటి చొప్పున ఎంపిక చేసి కె.వి.ఆర్. సైంటిఫిక్ సొసైటీకి పంపిస్తామని, వాటిలో ఉత్తమమైన 17 ప్రాజెక్టులకు జాతీయ సైన్స్ కాంగ్రెస్ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ కొండ జయరామిరెడ్డి, స్టేట్ అకడమిక్ కో–ఆర్టినేటర్ డాక్టర్ పి.మురళి, అప్కాస్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ జె.డి. రావు, డిస్ట్రిక్ట్ కో–ఆర్డినేటర్ మీర గౌస్, అప్కాస్ట్ అకౌంట్స్ ఆఫీసర్ కె.సుబ్బారావు, ప్రొ వైస్ చాన్స్‌లర్లు డాక్టర్ ఏవీఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్.వెంకటరామ్, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు, విద్యార్థి సంక్షేమ విభాగాధిపతి డాక్టర్ చప్పిడి హనుమంతరావు, డీన్ సలహాదారు డాక్టర్ కె.ఆర్.ఎస్.ప్రసాద్, అప్‌కాస్ట్ సభ్య కార్యదర్శి డాక్టర్ వై.అపర్ణ, అసోసియేట్ డీన్ డాక్టర్ కె.రూత్ రమ్య, ప్రొఫెసర్ ఆర్. సుభాకర్ రాజు, అప్ కాస్టింగ్ ప్లానింగ్ మేనేజర్, పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.