Education: విద్యతో బాల్య వివాహాలకు చెక్
Sakshi Education
కోలారు: విద్యతో బాల్య వివాహాల అడ్డుకట్ట సాధ్యమని, వాటి నివారణకు ఆడపిల్లలను తప్పనిసరిగా చదివించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ అధ్యక్షుడు ఎల్.నారాయణస్వామి తెలిపారు.
మార్చి 1న జెడ్పీ సభాంగణంలో కమిషన్ అధ్యక్షుడి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 98 మంది బాల గర్భిణులు ఉండటం ఆందోళనకరమన్నారు.
కోలారు జిల్లా ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. నేటి రోజుల్లో కూడా బాల్య వివాహాలు జరుగుతుండడం శోచనీయమన్నారు. ఇందుకు పేదరికం, నిరక్షరాస్యతే మూల కారణమన్నారు. అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పకుండా చదివించాలన్నారు. కమిషన్ సభ్యుడు శ్యామ్‌భట్, ఉప విభాగాధికారిణి వెంకటలక్ష్మి, ఏఎస్పీ రవికుమార్, కేజీఎఫ్ ఎస్పీ శాంతరాజు పాల్గొన్నారు.
Published date : 02 Mar 2024 11:04AM