Child Marriages : బాల్య వివాహాల నిషేదిక చట్టంపై కేరళా హైకోర్టు తీర్పు..
Sakshi Education
బాల్య వివాహాల నిషేధ చట్టం–2006 అన్ని మతాలవారికి వర్తిస్తుందని కేరళ హైకోర్టు తీర్పు చెప్పింది. ప్రతి భారతీయుడు మొదట పౌరుడని, ఆ తర్వాతే ఓ మతంలో సభ్యుడవుతారని.. అందువల్ల మతంతో సంబంధం లేకుండా అందరికీ ఈ చట్టం వర్తిస్తుందని వివరించింది. పాలక్కాడ్‌లో జరిగిన బాల్య వివాహంపై 2012లో నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఈ తీర్పునిచ్చింది. ఓ వ్యక్తి హిందువు, ముస్లిం, క్రైస్తవ, పారశీకుడు వంటి వాటిలో దేనికి చెందినవారైనప్పటికీ.. మతంతో సంబంధం లేకుండా అందరికీ 200 6చట్టం వర్తిస్తుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.
Supreme Court : ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
Published date : 06 Aug 2024 03:11PM