10th Class Results: రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
Sakshi Education
కర్ణాటకలో తాజాగా పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. స్టేట్ టాపర్‌గా నిలిచిన విద్యార్ధి ఫోటోను పాన్ ఇండియా స్టార్‌హీరో రిషబ్ శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ విజయం ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు.
కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాకు చెందిన అంకిత కొసప్ప ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షా ఫలితాల్లో దుమ్మురేపింది. అన్ని సబ్జెక్టుల్లోనూ నూటికి నూరుశాతం మార్కులతో అదరగొట్టింది. ఏకంగా 625/625 మార్కులు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఆమె తండ్రి బసప్ప ఒక రైతు.
తల్లి గృహిణి. ఆమె సాధించిన మార్కులతో వారి కుటుంబంలో పండుగ వాతావరణం ఉంది. అంకిత ముధోల్ తాలుకాలో ఉన్న మొరార్జీ దేశాయ్ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసింది.
భవిష్యత్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఆపై ఐఏఎస్ కావాలనేది తన టార్గెట్ అని ఆమె తెలిపింది. అంకిత విజయం పట్ల కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి శుభాకాంక్షలు తెలిపాడు. ఆమె తల్లిదండ్రుల ఫోటోను ఆయన షేర్ చేశారు. ఈ ఏడాది ఫలితాల్లో ఏడుగురు విద్యార్థులు 624 మార్కులు సాధించారని అక్కడి ప్రభుత్వం వెళ్లడించింది.
Published date : 11 May 2024 10:28AM