Skip to main content

Andhra Pradesh: టాపర్లకు నగదు బహుమతులు

ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్య విద్యాసంస్థల్లో టెన్త్, ఇంటర్‌ చదివి రాష్ట్ర స్థాయిలో ఆయా విద్యాసంస్థల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు సీఎం జగన్‌ చేతుల మీదుగా నగదు పుర స్కారాలను ప్రదానం చేశారు.
Cash prizes
పదో తరగతి విభాగంలో పల్నాడు జిల్లాకు చెందిన వెంకటేశ్‌కు అవార్డు అందజేస్తున్న సీఎం జగన్‌

పదో తరగతిలో మొదటి మూడు స్థానాల్లో 42 మంది విద్యార్థులు టాపర్లుగా నిలవగా 11 మంది ప్రథమ స్థానం, 16 మంది ద్వితీయ స్థానం, 15 మంది తృతీయ స్థానం సాధించారు. ఇంటర్‌లో గ్రూప్‌నకు ఒక్క రు చొప్పున 26 మంది విద్యార్థులు టాపర్లుగా నిలిచారు. తొలి స్థానంలో నిలిచినవారికి రూ.లక్ష నగదు, రెండో స్థానం సాధించినవారికి రూ.75 వేలు, తృతీయ స్థానంలో ఉన్నవారికి రూ.50 వేల నగదు చొప్పున బహుమతి అందజేశారు. 

Cash Prizes
శ్రీపద్మావతి మహిళా వర్సిటీ విద్యార్థిని కుసుమకు అవార్డును అందజేస్తున్న సీఎం జగన్‌   

ఉన్నత విద్యలో 20 మందికి పురస్కారం 

ఉన్నత విద్యలో వివిధ విభాగాల్లో ప్రతిభావంతులైన 20 మంది విద్యార్థులకు స్టేట్‌ ఎక్స్‌లెన్స్‌ అ వార్డులను ప్రదానం చేశారు. కమ్యూనిటీ స ర్వీసెస్, ఉత్తమ విద్యార్థి, ప్రతిభావంతుడైన వి ద్యార్థి, స్టూడెంట్‌ ఇన్నొవేషన్‌ విభాగాలతో పాటు క్విజ్‌ చాంపియన్‌షిప్‌లో గెలుపొందిన తొలి మూడు జట్లకు కూడా నగదు ప్రోత్సాహకాలు అందించారు. ప్రతి విభాగంలో మొదటి స్థానానికి రూ.లక్ష, రెండో స్థానానికి రూ.75 వేలు, మూడో స్థానానికి రూ.50 వేలు చొప్పున నగదు అందజేశారు. ఉత్తమ విద్యార్థి, ప్రతిభావంతుడైన విద్యార్థి కేటగిరీల్లో కన్సొలేషన్‌ బహుమతి కింద రూ.10 వేలు ప్రదానం చేశారు. టెన్త్‌ , ఇంటర్, ఉన్నత విద్యలో మొత్తం 88 మంది టాపర్లుగా నిలిచారు. విద్యార్థులందరినీ ప్రశంసాపత్రం, జ్ఞాపికతో సత్కరించారు. 

స్ఫూర్తిదాయకం.. ఆరోగ్యకరమైన పోటీ
సీఎం చేతుల మీదుగా పురస్కారాలు అందించడం మరింత మంది విద్యార్థుల్లో స్ఫూర్తి నింపుతుంది. ఆరోగ్యకరమైన పోటీత­త్వాన్ని పెంపొందిస్తున్నాం. అలాంటి విద్యార్థులను తయారు చేసిన అధ్యాపకులకు అభినందనలు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ విద్యా రంగానికి ఇంత ప్రాధాన్యం ఇవ్వలేదు. అందరూ గర్వపడేలా అవకాశాలు కల్పిస్తున్నాం. సామాన్య కుటుంబం నుంచి వచ్చినా ఉన్నత విద్య అభ్యసించేలా సీఎం జగన్‌ తోడుగా నిలిచి ప్రోత్సహిస్తున్నారు. డిజిటల్‌ విద్యలో మన విద్యార్థులు రాణించేలా చర్యలు చేపట్టారు.    
– బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి  

Published date : 21 Jun 2023 03:31PM

Photo Stories