Skip to main content

ఇన్‌ సర్వీస్‌ పీఈటీలకు శిక్షణ

రాష్ట్రంలో విద్యాశాఖలో వివిధ ప్రభుత్వ, స్థానికసంస్థలు, ప్రైవేట్‌ ఎయిడెడ్‌ స్కూళ్లలో పనిచేస్తున్న ఇన్‌ సర్వీస్‌ పీఈటీ టీచర్లకు 2021–23 విద్యా సంవత్సరాలకు బీపీఈడీ కోర్సులో చేరడానికి ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్య సంచాలకులు వి.చినవీరభద్రుడు ఉత్తర్వులు జారీ చేశారని ఉపాధ్యాయ సంఘాల సమన్వయవేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి నవంబర్‌ 12న ఒక ప్రకటనలో తెలిపారు.
ఇన్‌ సర్వీస్‌ పీఈటీలకు శిక్షణ
ఇన్‌ సర్వీస్‌ పీఈటీలకు శిక్షణ

అయితే ఇన్‌ సర్వీస్‌ పీఈటీలు ఈ బీపీఈడీ కోర్సు పూర్తిచేయడానికి వేసవి సెలవుల్లోనే శిక్షణా తరగతులకు హాజరయ్యేలా అవకాశం కల్పించాలని ఒంటేరు శ్రీనివాసులరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. తద్వారా విద్యాసంవత్సరం మధ్యలో విద్యార్థులకు వ్యాయామ విద్య తరగతులకు ఇబ్బంది కలగకుండా నివారించవచ్చని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు కూడా తమ సేవా కాలాన్ని కోల్పోవడం జరగదని అన్నారు. 

చదవండి: 

అంతర్జాతీయ ప్రమాణాలతో ‘ఆనర్స్‌’

ఫౌండేషన్ స్కూల్‌ విధానానికి శ్రీకారం

Engineering: ఇంజనీరింగ్‌ సీట్ల కేటాయింపు

Published date : 13 Nov 2021 01:34PM

Photo Stories