Skip to main content

Engineering: ఇంజనీరింగ్‌ సీట్ల కేటాయింపు

ఎంసెట్ కౌన్సెలింగ్లో భాగంగా నవంబర్ 12న రెండో దశ ఇంజనీరింగ్ సీట్లను కేటాయించనున్నారు.
Engineering
ఇంజనీరింగ్‌ సీట్ల కేటాయింపు

మధ్యాహ్నం తర్వాత వివరాలు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయని తెలంగాణ ఉన్నత విద్య మండలి తెలిపింది. హైకోర్టు ఆదేశాలతో రెండో దశలో కంప్యూటర్‌ సైన్స్ కు చెందిన దాదాపు 4,600 సీట్లు కొత్తగా అందుబాటులోకి రావడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. మొత్తం 36 వేల మంది, 16.5 లక్షల ఆప్షన్లు ఇచ్చారు. ఇందులో ఎక్కువగా కంప్యూటర్‌ సైన్స్ కు చెందినవే ఉన్నాయి. ఇదిలాఉంటే, రెండో దశ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముగిసిన వెంటనే ప్రత్యేక కౌన్సెలింగ్‌కు ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు చేస్తోంది. నెలాఖరులోగా కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముగించి వచ్చే నెల నుంచి క్లాసులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

చదవండి: 

టైప్‌రైటింగ్, షార్ట్‌హ్యాండ్‌ పరీక్షలు తేదీలు

Teachers: ఉపాధ్యాయుల నియామకానికి ఏర్పాట్లు

Jobs: భారీ ఉద్యోగ ప్రకటన

Published date : 12 Nov 2021 05:36PM

Photo Stories