Jobs: భారీ ఉద్యోగ ప్రకటన
జోనల్ వ్యవస్థలో ఉద్యోగుల సర్దుబాటు అయిన తర్వాత ఏర్పడే ఖాళీలను భర్తీ చేయాలనే సంకల్పంతో ఉందని తెలిపింది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షురాలు మమత నవంబర్ 11న ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడంలో జాప్యం జరిగిందని, అందువల్లే ఉద్యో గ నోటిఫికేషన్ ఆలస్యమైందని, దీన్ని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని సీఎం కోరారని తెలిపారు. కొత్త జిల్లాలకు ఆప్షన్లు, ఉద్యోగుల సీనియారిటీ ప్రాతిపదికన వారిని ఆయా జిల్లాలకు కేటాయించడం, ఈ క్రమంలో ఏర్పడే ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. ప్రభుత్వం తీసుకుంటు న్న ఈ చర్యలవల్ల 95 శాతం నిరుద్యోగులకు ఉద్యోగాలొస్తాయని పేర్కొన్నారు. సంఘం చైర్మన్, వ్యవస్థాపక అధ్యక్షుడు వి.శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో టీజీవో తరపున తాను, ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణ సీఎంను కలిసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు బకాయి పడ్డ కరువు భత్యాన్ని వెంటనే విడుదల చేస్తామని సీఎం తెలిపారని మమత వెల్లడించారు.
చదవండి:
EWS: ఈడబ్ల్యూఎస్ సీట్లన్నీ కన్వీనర్ కోటాలోనే