NIT: ఏపీ నిట్ స్నాతకోత్సవం
Sakshi Education
అతితక్కువ కాలంలోనే దేశంలోని పెద్ద నిట్‌లతో పోటీపడే స్థాయికి ఏపీ నిట్ చేరిందని నిట్ డైరెక్టర్ సీఎస్‌పీ రావు అన్నారు.
నవంబర్ 13న నిర్వహించనున్న నిట్ 2, 3వ స్నాతకోత్సవాల (2016–20, 2017–21 బ్యాచ్‌లు) వివరాలను నవంబర్ 11న ఆయన వెల్లడించారు. డీఆర్‌డీవో చైర్మన్ జి.సతీష్‌రెడ్డి, డీఆర్‌డీఎల్ డైరెక్టర్ దశరథరామ్ యాదవ్, బోర్డు ఆఫ్ గవర్నెన్సు చైర్‌పర్సన్ మృదులా రమేష్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని చెప్పారు. ఏపీ నిట్‌లో ప్రస్తుతం నాలుగో ఏడాదిలో ఉన్న విద్యార్థుల్లో 170 మంది రూ.7.8 లక్షలు నుంచి రూ.26 లక్షలతో ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు. స్నాతకోత్సవంలో 2016–20, 2017–21 బ్యాచ్‌లలో టాపర్లు, బ్రాంచ్‌ల వారీగా ఉత్తమ సీజీపీఏ సాధించిన విద్యార్థులకు స్వర్ణ పతకాలు అందిస్తామన్నారు.
చదవండి:
Teachers: ఉపాధ్యాయుల నియామకానికి ఏర్పాట్లు
Published date : 12 Nov 2021 02:42PM