అంతర్జాతీయ ప్రమాణాలతో ‘ఆనర్స్’
సామాజిక, ఆర్థిక అంశాలపై విస్తృత అవగాహన, బహుళజాతి సంస్థల్లోనూ ఉపాధి అవకాశం కల్పించగల నైపుణ్యం అందించడమే కోర్సుల ముఖ్య లక్ష్యమని చెప్పింది. సివిల్స్ వంటి జాతీయ పోటీ పరీక్షల్లో సైతం నెగ్గుకొచ్చే ప్రమాణాలు ఆనర్స్ కోర్సుల ప్రత్యేకతలని తెలిపింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కాబోతున్న బీఏ(ఆనర్స్) పాఠ్య ప్రణాళిక, ప్రత్యేక తలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి నేతృత్వంలో నిపుణులు నవంబర్ 11న విలేకరులకు వివరించారు. కోఠి ఉమెన్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్, నిజాం కాలేజీలో ఎకనమిక్స్ ప్రవేశపెట్టామని, ఈ నెల 20 వరకూ ప్రవేశం పొందవచ్చన్నారు. వచ్చే ఏడాది నుంచి మరికొన్ని స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులతో విస్తరించనున్నట్లు ఓయూ వీసీ ప్రొ.డి.రవీందర్ చెప్పారు. ఉన్నత విద్యా మండలి వైఎస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, కోఠి ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ విజ్జుల్లత, నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ నారాయణ పాల్గొన్నారు.
మూలాల్లోకి వెళ్లే పాఠ్యాంశాలు
రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఎకనమిక్స్ (ఆనర్స్) వ్యవస్థ మూలాలను అన్వేషించేదిగా ఉంటుంది. నయా ఉదారవాద ఆర్థిక విధానాలపై పరిశోధనస్థాయిలో పాఠ్య ప్రణాళిక రూపొందించాం. దేశ, విదేశాల్లో ఆర్థికంగా వస్తున్న మార్పులు, వాటి చరిత్ర, పర్యవసానాలు లోతుల్లోకి విశ్లేషించే సత్తా విద్యార్థులకు కలి్పంచేలా ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్‌తోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం జోడించడం ప్రణాళికలో కీలకాంశం. అర్థశాస్త్రంలో కోర్ సబ్జెక్టులు, డేటాబేస్ ఉపాధి అవకాశాలను పెంచడంతోపాటు జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాలకు పోటీపడే సమర్థత వస్తుంది. కేవలం తరగతి బోధనకే పరిమితం కాకుండా, ఆర్థికరంగ నిపుణులు, అంతర్జాతీయ ప్రముఖులతో వాస్తవ ఆర్థిక స్థితిగతులపై లోతైన అవగాహన కలి్పంచడానికి ప్రాధాన్యమిస్తాం.
–ప్రొ.రేవతి, సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) డైరెక్టర్
విస్తృత రాజకీయ అవగాహన
స్వీయ విశ్లేషణ కరువైన నేటి పరిస్థితుల్లో విస్తృత రాజకీయ అవగాహన కల్పించేలా ఆనర్స్ (పొలిటికల్ సైన్స్)లో బోధన ఉండబోతోంది. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో సైతం తేలికగా సీటు లభించేలా విద్యార్థుల స్థాయి పెరుగుతుంది. జాతీయ, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో అవగాహన తరగతులు ఉంటాయి.
– ప్రొఫెసర్ జె.ముసలయ్య, రాజకీయ శాస్త్రం ప్రధానాచార్యులు