IIIT Basara: హామీలు నెరవేరుస్తాం: వెంకటరమణ
Sakshi Education
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఇచ్చిన హామీలను జూలై 24లోగా నెరవేరుస్తామని ఇన్‌చార్జి వీసీ వెంకటరమణ హామీ ఇచ్చారు.
విద్యార్థుల సమైక్య కమిటీ (Student Governing Council (SGC))తో జూలై 17ప నిర్వహించిన సమావేశంలో విద్యార్థులు.. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆరోగ్యంపై చిత్తశుద్ధి లేకుండా కలుషిత ఆహారం వడ్డించిన మూడు మెస్‌ల టెండర్లు రద్దు చేయాలని, శాశ్వత వీసీ, యూనిఫాం, షూస్, స్పోర్ట్స్ వేర్‌కు సంబంధించిన టెండర్లను త్వరగా పూర్తి చేయాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళనలు పునరావృతం అవుతాయని తెలిపారు. దీనిపై స్పందించిన ఇన్‌చార్జి వీసీ విద్యార్థుల డిమాండ్లను నెరవేరుస్తామని లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చారు.
చదవండి:
Published date : 18 Jul 2022 01:39PM