IIIT Basara: సమస్యలు పరిష్కరిస్తాం
విద్యార్థులు ఆందోళన విరమించి తరగతులకు హాజరు కావాలని సూచించారు. Basara IIITలో గత కొన్నిరోజులుగా విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు, నిర్మల్ జిల్లా అధికారులు, Basara IIIT అధికారులతో మంత్రులు జూన్ 14న చర్చించారు. అనంతరం సబిత, ఇంద్రకరణ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు పేర్కొన్న సమస్యల పరిష్కారానికి ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ను RGUKTకి పంపినట్లు వెల్లడించారు. అత్యవసర సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్‌కు సూచించామని, మిగిలిన వాటిని ప్రాధాన్యతా క్రమంలో పరిష్క రించాలని ఆదేశించినట్లు మంత్రులు తెలిపారు. త్వరలోనే తాము బాసర విద్యాలయానికి వెళ్లి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పారు. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా విద్యాసంస్థలు సరిగా పనిచేయలేదని, ఈ కారణంగా కొన్ని సమస్యలు ఉండటం సహజమని సబిత అంగీకరించారు. కొన్ని పార్టీలు దీన్ని రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు.
విద్యార్థుల డిమాండ్లు ఇవే..
☛ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా కేటీఆర్ వర్సిటీని సందర్శించాలి.
☛ రెగ్యులర్ వీసీని నియమించాలి. ఆయన క్యాం పస్‌లోనే ఉండాలి.
☛ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అధ్యాపకుల సంఖ్యను పెంచాలి.
☛ ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ ఆధారిత విద్యను అందించాలి.
☛ ఇతర వర్సిటీలు, సంస్థలతో వర్సిటీని అనుసంధానం చేయాలి.
☛ తరగతి, హాస్టల్ గదులకు మరమ్మతులు చేయాలి.
☛ ల్యాప్‌టాప్‌లు, యూనిఫామ్, మంచాలు, బెడ్లు అందించాలి.
☛ మెస్‌ల మెయింటెనెన్స్ మెరుగ్గా ఉండేలా చూడాలి.
☛ పీడీ, పీఈటీలను నియమించి క్రీడలనూ ప్రోత్సహించాలి.