IIIT Basara: సీఎం దృష్టికి ట్రిపుల్‌ఐటీ సమస్యలు
యూనివర్శిటీ స్టూడెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆకాశ్ జూలై 11న హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి ట్రిపుల్‌ఐటీలోని పరిస్థితుల గురించి విన్నవించారు. సీఎం హోదాలో ఒక్కసారి ట్రిపుల్‌ఐటీని సందర్శించాలని విజ్ఞప్తి చేశారు.
సమయం చూసి తప్పకుండా వస్తానని సీఎం హామీ ఇచ్చారు. రెండేళ్ల క్రితం వేలా ది మంది విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసి యూనివర్సిటీ రోడ్లమీద నిరసనలు తెలిపారు.
చదవండి: IIIT Intergrated B Tech Admissions: బాసరలో ట్రిపుల్‌ఐటీ ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలు..
అప్పట్లో టీపీసీసీ అధ్యక్షులుగా రేవంత్‌రెడ్డి పోలీసు వలయాలను దాటుకుని ట్రిపుల్‌ఐటీ గోడ దూకి విద్యార్థుల వద్దకు వెళ్లారు. అప్పటి సమస్యలు ఇ ప్పుడూ అలాగే ఉన్నాయి.
ఈ సమస్యలపై విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో ఓ కమిటీ వేసి పరి ష్కారం కోసం దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో వి ద్యార్థులే హైదరాబాద్‌కు వెళ్లి సీఎంను కలిసి 19 సమస్యలు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. సీఎం సూ చనమేరకు ఆయన వ్యక్తిగత సలహాదారు జైపాల్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.