HCU: పీహెచ్‌డీ కోర్సులకు దరఖాస్తులు..చివరీ తేదీ ఇదే..
ప్రవేశ పరీక్షను అక్టోబర్ 7, 8 తేదీల్లో నిర్వహించేందు కు ఏర్పాట్లు చేశారు. పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షను దేశవ్యాప్తంగా 12 కేంద్రాల్లో నిర్వ హించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. HCUలో PhD కో ర్సుల కోసం దరఖాస్తులను సెప్టెంబర్ 15 వరకు స్వీకరించనున్నారు. HCUలో 42 PhD ప్రవేశాల కోసం 281 సీట్లు ఉంటాయి. మరిన్ని వివరాలకు వెబ్ సైట్ http://acad.uohyd.ac.in సందర్శించాలని అధికారులు సూచించారు.
చదవండి: హెచ్‌సీయూలో చేరే మార్గం.. ఈ పరీక్షతో సాధ్యం..!
హెచ్‌సీయూ ప్రొఫెసర్‌కు అరుదైన అవకాశం.. 300 ఏళ్ల చరిత్ర కలిగిన బ్రిల్ పబ్లిషింగ్ హౌస్‌లో సభ్యత్వం..
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ) అధ్యాపకుడికి అరుదైన, అంతర్జాతీయ అవకాశం దక్కింది. గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ పూర్వవిద్యార్థి, ప్రస్తుతం ఇదే వర్సిటీలో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ప్రమోద్ కే నాయర్.. 300 ఏళ్ల చరిత్ర కలిగిన బ్రిల్ ప్రచురణ కేంద్రం (పబ్లిషింగ్ హౌస్) ఎడిటోరియల్ బోర్డులో సభ్యత్వానికి ఎంపికయ్యారు. తద్వారా ఈ ఘనత పొందిన తొలి భారతీయ ప్రొఫెసర్‌గా నిలిచారు. బ్రిల్ నుంచి రానున్న ‘క్రిటికల్ పోస్త్‌హ్యూమనిజం’అనే ఈ-పుస్తక ధారావాహికకు ఆయన ఎంపికయ్యారు. ప్రొఫెసర్ ప్రమోద్ రచించిన పుస్తకాలు, జర్నల్స్ ఆధారంగా ఆయనకు ఈ అవకాశం దక్కింది. కాగా, నెదర్లాండ్‌సలోని లీడెన్ నగరంలో 1683లో బ్రిల్ పబ్లిషింగ్ హౌస్ ప్రారంభమైంది. హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్, ఇంటర్నేషనల్ లా, సైన్స్ లోని కొన్ని విభాగాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రచురణలను ఈ సంస్థ వెలువరిస్తుంది.