హెచ్‌సీయూలో చేరే మార్గం.. ఈ పరీక్షతో సాధ్యం..!
తాజాగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.. పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. హెచ్‌సీయూ అందిస్తున్న కోర్సుల వివరాలు..
ఇంటిగ్రేటెడ్ కోర్సులు..
ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ..
- మ్యాథమెటికల్ సైన్సెస్
- ఫిజిక్స్
- కెమికల్ సైన్సెస్
- సిస్టమ్స్ బయాలజీ
- అప్లయిడ్ జియాలజీ
- హెల్త్ సైకాలజీ స్పెషలైజేషన్స్‌తో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ అందుబాటులో ఉంది.
- అలాగే ఆరేళ్ల వ్యవధితో మాస్టర్ ఆఫ్ ఆప్టోమెట్రి కోర్సును సైతం ఈ యూనివర్సిటీ అందిస్తోంది.
అర్హత: సైన్స్ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు. ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సుకు అన్ని గ్రూపుల విద్యార్థులు అర్హులు.
ఇంటిగ్రేటెడ్ ఎంఏ..
హ్యుమానిటీస్:
- హిందీ
- తెలుగు
- లాంగ్వేజ్ సైన్సెస్
- ఉర్దూ.
సోషల్ సైన్సెస్:
- ఎకనామిక్స్
- హిస్టరీ
- పొలిటికల్ సైన్స్
- సోషియాలజీ
- ఆంత్రోపాలజీల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సు అందుబాటులో ఉంది.
అర్హత: ఏదైనా గ్రూపులో 60 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత.
పరీక్ష విధానం..
ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ–మ్యాథ్స్, ఫిజిక్స్, కెమికల్ సైన్సెస్, సిస్టమ్స్ బయాలజీ, అప్లయిడ్ జియాలజీ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం 100 మార్కులకు ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీల నుంచి 25 ప్రశ్నల చొప్పున అడుగుతారు. ఎమ్మెస్సీ హెల్త్ సైకాలజీ కోర్సు ప్రశ్నపత్రం 100 మార్కులకు ఉంటుంది. ఇంటర్ స్థాయి సైకాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
ఇంటిగ్రేటెడ్ ఎంఏ హ్యుమానిటీస్ కోర్సులకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. 100 మార్కులకు ఉండే ప్రశ్నపత్రంలో అభ్యర్థి ఎంచుకున్న లాంగ్వేజ్‌పై 40 ప్రశ్నలు, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌పై 35 ప్రశ్నలు, వర్తమాన వ్యవహారాలు, జనరల్ నాలెడ్జ్‌పై 25 ప్రశ్నలు అడుగుతారు.
ఇంటిగ్రేటెడ్ ఎంఏ సోషల్ సైన్సెస్ సబ్జెక్టులకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష జరుగుతుంది. 100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో సోషల్ స్టడీస్ అండ్ జనరల్ అవేర్‌నెస్, లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ విభాగాల నుంచి 25 ప్రశ్నల చొప్పున అడుగుతారు.
ఇంటిగ్రేటెడ్ కోర్సుల ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం ఇంటర్మీడియెట్ స్థాయిలో ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండు గంటలు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కు కోత విధిస్తారు.
పీజీ స్థాయి కోర్సులు..
మాస్టర్ ఆఫ్ సైన్స్(ఎమ్మెస్సీ)..
- మ్యాథ్స్/అప్లయిడ్ మ్యాథ్స్
- స్టాటిస్టిక్స్
- ఫిజిక్స్
- కెమిస్ట్రీ
- బయోకెమిస్ట్రీ
- ప్లాంట్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ
- మాలిక్యులర్ బయాలజీ
- యానిమల్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ
- ఓషన్ అండ్ అట్మాస్ఫియరిక్ సైన్సెస్
- హెల్త్ సైకాలజీ
- న్యూరల్ అండ్ కాగ్నిటివ్ సైన్సెస్.
ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ కోర్సులో ప్రవేశాలను ఆర్‌సీబీ ఫరీదాబాద్ నిర్వహించే గాట్–బి ద్వారా ఖరారు చేస్తారు.
ఎంసీఏ: నిమ్‌సెట్–2021 ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
ఎంబీఏ: హెల్త్‌కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్, బిజినెస్ అనలిటిక్స్,ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ. క్యాట్ ర్యాంకు ఆధారంగా ఎంబీఏలో ప్రవేశాలను ఖరారు చేస్తారు.
మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్(ఎంఏ)..
- ఇంగ్లిష్
- ఫిలాసఫీ
- హిందీ
- తెలుగు
- ఉర్దూ
- అప్లయిడ్ లింగ్విస్టిక్స్
- కంపారిటివ్ లిటరేచర్
- ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్టడీస్
- హిస్టరీ
- పొలిటికల్ సైన్స్
- సోషియాలజీ
- ఆంత్రోపాలజీ
- ఎకనామిక్స్
- ఫైనాన్షియల్ ఎకనామిక్స్
- కమ్యూనికేషన్(మీడియా ప్రాక్టీస్) తదితరాలు.
ఎంఈడీ, ఎంపీఏ(డ్యాన్స్), ఎంపీఏ(థియేటర్ ఆర్ట్స్), ఎంపీఏ మ్యూజిక్, మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్(పెయింటింగ్, ప్రింట్ మేకింగ్ అండ్ స్కల్పచర్, ఆర్ట్ హిస్టరీ అండ్ విజువల్ స్టడీస్), మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(ఎంపీహెచ్).
ఎంపిక విధానం: కోర్సును అనుసరించి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ(ఎంటెక్)..
- కంప్యూటర్ సైన్స్
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
- ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ
- బయోఇన్ఫర్మాటిక్స్
- మెటీరియల్స్ ఇంజనీరింగ్
- నానో సైన్స్ అండ్ టెక్నాలజీ
- మాన్యుఫ్యాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో ఎంటెక్‌లో ప్రవేశానికి గేట్ స్కోర్ ఉండాలి.
ఇంటిగ్రేటెడ్ ఎంటెక్:ఎంటెక్ కంప్యూటర్ సైన్స్‌లో జేఈఈ సీఎస్‌ఏబీ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
పీహెచ్‌డీ..
- అప్లయిడ్ మ్యాథమెటిక్స్
- కంప్యూటర్ సైన్స్
- ఫిజిక్స్
- ఎలక్ట్రానిక్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
- ఎర్త్, ఓషన్ అండ్ అట్మాస్ఫియరిక్ సైన్సెస్
- కెమిస్ట్రీ
- బయోటెక్నాలజీ
- సిస్టమ్స్ అండ్ కంప్యూటేషనల్ బయాలజీ
- ఇంగ్లిష్
- ఫిలాసఫీ
- హిందీ
- తెలుగు
- ఉర్దూ
- అప్లయిడ్ లింగ్విస్టిక్స్
- ట్రాన్స్‌లేషన్ స్టడీస్
- కంపారిటివ్ లిటరేచర్
- సంస్కృతం
- హిస్టరీ
- పొలిటికల్ సైన్స్
- సోషియాలజీ
- ఆంత్రోపాలజీ
- ఎడ్యుకేషన్
- రీజనల్ స్టడీస్
- ఫోక్ కల్చర్ స్టడీస్
- జెండర్ స్టడీస్
- ఎకనామిక్స్
- డ్యాన్స్
- థియేటర్ ఆర్ట్స్
- కమ్యూనికేషన్
- మేనేజ్‌మెంట్ స్టడీస్
- హెల్త్ సైన్సెస్
- ఫిజియాలజీ
- మెటీరియల్స్
- మెటీరియల్స్ ఇంజనీరింగ్
- నానో సైన్స్ అండ్ టెక్నాలజీ.
ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ/పీహెచ్‌డీ: బయోకెమిస్ట్రీ, మాలిక్యులర్ బయాలజీ, యానిమల్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ, బయోటెక్నాలజీ.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, ఇంటర్వూ ఆధారంగా ప్రవేశం లభిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 20, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://uohyd.ac.in