Skip to main content

KNRUHS: ఆయుష్‌ పీజీ వైద్య సీట్ల భర్తీకి దరఖాస్తులు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని ఆయుష్‌ పీజీ వైద్య సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య‌ విశ్వవిద్యాలయం జనవరి 5న నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
KNRUHS
ఆయుష్‌ పీజీ వైద్య సీట్ల భర్తీకి దరఖాస్తులు

ఏఐఏపీజీఈటీ–2022 పరీక్షలో అర్హత సాధించిన వారు దరఖాస్తుకు అర్హులని స్పష్టం చేసింది. పీజీ ఆయుర్వేదం, హోమియో, యునానీ కోర్సుల్లో కన్వీనర్‌ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థుల నుండి జ‌న‌వ‌రి 6 ఉదయం 9 గంటల నుంచి జనవరి 13వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. అర్హత, మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను చూడాలని విశ్వవిద్యాలయం సూచించింది.   

చదవండి:

Ayush: ఆయుష్‌ పెట్టుబడుల సదస్సును ఎక్కడ ప్రారంభించారు?

కేంద్రం ప్రారంభించిన నేషనల్‌ ఆయుష్‌ మిషన్‌ లక్ష్యాలు?

Published date : 06 Jan 2023 01:22PM

Photo Stories