Ayush: ఆయుష్ పెట్టుబడుల సదస్సును ఎక్కడ ప్రారంభించారు?
Global Ayush Investment and Innovation Summit-2022: గుజరాత్ రాష్ట్ర రాజధాని గాంధీనగర్ వేదికగా 3 రోజుల అంతర్జాతీయ ఆయుష్ పెట్టుబడుల మరియు ఆవిష్కరణల సదస్సు–2022 ప్రారంభమైంది. మారిషస్ ప్రధాని జగన్నాథ్, డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ సమక్షంలో ఫిబ్రవరి 20న ప్రధాని నరేంద్ర మోదీ ఈ సదస్సును ప్రారంభించారు. అనంతరం హీల్ ఇన్ ఇండియా కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
Defence Ministry: రక్షణ రంగంలో దేశీయ కొనుగోళ్లకు ఎంత శాతం నిధులు కేటాయించారు?
ప్రధాని ప్రసంగం–ముఖ్యమైన అంశాలు
- ఆయుష్ (ఆయుర్వేద, యోగ, నాచురోపతి, యునానీ, సిద్ధ, హోమియోపతి) చికిత్స కోసం భారత్ వచ్చేవాళ్లకు ప్రత్యేక వీసా కేటగిరీ ఏర్పాటు చేస్తాం.
- సంప్రదాయ వైద్యాన్ని ప్రోత్సహించడానికి త్వరలో ప్రవేశపెట్టే ఆయుష్ మార్క్‌తో ఆ ఉత్పత్తులకు విశ్వసనీయత పెరుగుతుంది.
- ప్రత్యామ్నాయ ఔషధ విధానాల కోసం కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక శాఖ ద్వారా నూతన సాంకేతికతలతో తయారయ్యే ఆయుష్ ఉత్పత్తులకు మార్కింగ్ ఇస్తారు.
- సంప్రదాయ వైద్య విధానాల వల్లే కేరళలో టూరిజం పెరుగుతోంది. ఇది దేశమంతా విస్తరించాలి. హీల్ ఇన్ ఇండియా ఈ దశాబ్దానికి అతిపెద్ద బ్రాండ్ కావాలి.
- దహోద్(గుజరాత్)లో రూ. 20 వేల కోట్లతో ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం.
- 2014కు పూర్వం ఆయుష్ రంగ విలువ 300 కోట్ల డాలర్ల కన్నా తక్కువ, ప్రస్తుతమిది 1800 కోట్ల డాలర్లను దాటింది.
- సంప్రదాయ వైద్య స్టార్టప్‌లకు ఆయుష్ శాఖ సాయం చేస్తుంది. ఈ రంగం నుంచి యూనికార్న్‌లు (వందకోట్ల డాలర్ల విలువ దాటిన స్టార్టప్‌లు) వస్తాయి.
- ఆయుష్ ఈమార్కెట్ పోర్టల్‌ను విస్తరించి రైతులను కంపెనీలతో అనుసంధానం చేస్తాం.
టెడ్రోస్ కాదు.. తులసీ భాయ్
హీల్ ఇన్ ఇండియా సదస్సుకు హాజరైన డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్‌కు ప్రధాని మోదీ తులసీ భాయ్ అని భారతీయ పేరు పెట్టారు. టెడ్రోస్ గుజరాతీలో ప్రసంగాన్ని ఆరంభించేందుకు ప్రయత్నించడాన్ని అభినందించారు. సదస్సులో టెడ్రోస్ మాట్లాడుతూ.. విదేశీ మార్కెట్లలో ఆయుష్ ఉత్పత్తుల ప్రోత్సాహానికి ఆయుష్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు చేశామని చెప్పారు. మరోవైపు భారత్, మారిషస్ మధ్య ద్వైపాక్షిక సహకారంతో పాటు పలు అంశాలపై మోదీ, జగన్నాథ్ చర్చలు జరిపారు.
WHO-GCTM: డబ్ల్యూహెచ్‌ఓ సంప్రదాయ వైద్య కేంద్రానికి ఎక్కడ శంకుస్థాపన చేశారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ ఆయుష్ పెట్టుబడుల మరియు ఆవిష్కరణల సదస్సు–2022 ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్ 20
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : గాంధీనగర్, గుజరాత్
ఎందుకు : ఆయుష్ (ఆయుర్వేద, యోగ, నాచురోపతి, యునానీ, సిద్ధ, హోమియోపతి) రంగంలో పెట్టుబడుల అవకాశాలను గురించి, నూతన ఆవిష్కరణల ప్రాముఖ్యతను గురించి వివరించేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్