Skip to main content

Defence Ministry: రక్షణ రంగంలో దేశీయ కొనుగోళ్లకు ఎంత శాతం నిధులు కేటాయించారు?

Defence

దేశీయ ఉత్పత్తుల కొనుగోలుకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్లు రక్షణ శాఖ ప్రకటించింది. 2021–22లో తమ బడ్జెట్‌లో ఇందుకు ఏకంగా 65.50 శాతం నిధులు వెచ్చించినట్లు ఏప్రిల్‌ 20న తెలిపింది. 64 శాతం ఖర్చు చేయాలన్న 2021–22 బడ్జెట్‌ కేటాయింపులను 99.5 శాతం ఖర్చు చేశామని తెలిపింది. లక్ష్యాన్ని అధిగమించినట్టు చెప్పింది. ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’లో భాగంగా రక్షణ శాఖకు ఆయుధాలు, సామగ్రిని దేశీయంగానే ఉత్పత్తి చేయాలని, అందుకు చేయూతనివ్వాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

WHO-GCTM: డబ్ల్యూహెచ్‌ఓ సంప్రదాయ వైద్య కేంద్రానికి ఎక్కడ శంకుస్థాపన చేశారు?

ఐఎన్‌ఎస్‌ వాగ్‌షీర్‌ జలాంతర్గామి ఎక్కడ జలప్రవేశం చేసింది?
ప్రాజెక్ట్‌–75లో భాగంగా మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ రూపొందించిన ఆరో సబ్‌మెరైన్‌ ‘ఐఎన్‌ఎస్‌ వాగ్‌షీర్‌’ ఏప్రిల్‌ 20న ముంబై తీరంలో లాంఛనంగా జలప్రవేశం చేసింది. ఈ జలాంతర్గామిని మరో ఏడాదిపాటు సముద్ర జలాల్లో కఠిన పరీక్షలకు గురిచేస్తారు. ఆ తర్వాత నావికాదళంలో చేర్చుకుంటారు. ఐఎన్‌ఎస్‌ వాగ్‌షీర్‌ రాకతో భారత నావికాదళం శక్తి మరింత పెరుగుతుందని రక్షణ శాఖ అధికారులు చెప్పారు.

Indian Navy: ప్రాజెక్టు–75లో భాగంగా తయారైన చిట్టచివరి సబ్‌మెరైన్‌?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
2021–22 ఏడాది రక్షణ రంగం బడ్జెట్‌లో దేశీయ ఉత్పత్తుల కొనుగోళ్లకు 65.50 శాతం నిధులు కేటాయింపు
ఎప్పుడు : ఏప్రిల్‌ 20
ఎవరు    :  రక్షణ శాఖ 
ఎందుకు : ఆత్మనిర్భర్‌ భారత్‌’లో భాగంగా రక్షణ శాఖకు ఆయుధాలు, సామగ్రిని దేశీయంగానే ఉత్పత్తి చేయాలని, అందుకు చేయూతనివ్వాలని..

Published date : 21 Apr 2022 11:38AM

Photo Stories