Skip to main content

కేంద్రం ప్రారంభించిన నేషనల్‌ ఆయుష్‌ మిషన్‌ లక్ష్యాలు?

నేషనల్‌ ఆయుష్‌ మిషన్‌(నామ్‌)ను కేంద్ర ప్రాయోజిత పథకంగా 2021, ఏప్రిల్‌ 1 నుంచి 2026, మార్చి 31 వరకూ కొనసాగింపునకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జూలై 14న సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు ఆమోదం తెలిపింది. నామ్‌ కొనసాగింపునకు రూ.4,607.30 కోట్ల వ్యయం కానుంది. ఇందులో కేంద్రం వాటా రూ.3,000 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.1,607 కోట్లుగా ఉంటుంది. నేషనల్‌ ఆయుష్‌ మిషన్‌ను కేంద్ర ప్రభుత్వం 2014 సెప్టెంబరు 15న ప్రారంభించింది. అర్హులందరికీ వైద్య సేవలు అందేలా చూడడం, ఔషధాలు, మానవ వనరుల లభ్యత పెరిగేలా చూడడం, ఆయుష్‌ విద్యా సంస్థల సంఖ్యను పెంచడం వంటివి ఆయుష్‌ మిషన్‌ లక్ష్యాలు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : నేషనల్‌ ఆయుష్‌ మిషన్‌(నామ్‌)ను 2021, ఏప్రిల్‌ 1 నుంచి 2026, మార్చి 31 వరకూ కొనసాగింపునకు ఆమోదం
ఎప్పుడు : జూలై 14
ఎవరు : కేంద్ర మంత్రివర్గం
ఎందుకు : అర్హులందరికీ వైద్య సేవలు అందేలా చూడడం, ఔషధాలు, మానవ వనరుల లభ్యత పెరిగేలా చూడడం వంటి లక్ష్యాల సాధన కోసం...
Published date : 15 Jul 2021 06:29PM

Photo Stories