ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు గడువు తేదీ ఇదే.. పెద్ద ఉద్యోగం పక్కా!
ఈ ప్రోగ్రామ్ కింద అర్హులైన విద్యార్థులు బిట్స్ పిలానీలో ఎంటెక్ కోర్సులో చేరొచ్చు. ఫుల్‌టైమ్ జాబ్, ఫుల్ స్పాన్సర్‌షిప్ కల్పిస్తారు. కోర్సు పూర్తి చేసినవారికి కనీసం రూ.5 లక్షల వార్షిక ప్యాకేజీతో విప్రోలో ఉద్యోగం ఇస్తారు. ఈ కోర్సుకు 60 శాతం మార్కులు లేదా 6 సీజీపీఏతో కంప్యూటర్ సైన్స్, ఐటీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో బీసీఏ/బీఎస్సీ పూర్తి చేసినవారు అర్హులు. మూడేళ్లలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 2021, 2022, 2023 బ్యాచ్‌లకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
చదవండి: Salary Hike : ఐటీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 20-25శాతం ఇంక్రిమెంట్లు..
ఈ ప్రోగ్రామ్ కింద విప్రో 8 వేల మందిని ఎంపిక చేయనుంది. వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌కు ఎంపికై ఎంటెక్ చేసే సమయంలో ప్రతి నెలా స్టైపెండ్ కింద మొదటి ఏడాది నెలకు రూ.15,488 చొప్పున అందిస్తారు. రెండో ఏడాది నెలకు రూ.17,553 చొప్పున, మూడో ఏడాది నెలకు రూ.19,618 చొప్పున ఇస్తారు. నాలుగో ఏడాది నెలకు రూ.23 వేలు చొప్పున చెల్లిస్తారు. కోర్సు పూర్తైన వెంటనే విప్రోలోనే ఉద్యోగం ఇస్తారు. శిక్షణ కాలం 60 నెలలు ఉంటుంది. ఆసక్తి గల విద్యార్థులు https://bit.ly//APSCHE&WIPRO ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్‌కు కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల విద్యార్థులకు ఫిబ్రవరి 23న గుంటూరులో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఉత్తరాంధ్ర విద్యార్థులకు విశాఖలో ఫిబ్రవరి 25, 26 తేదీల్లో నిర్వహిస్తారు. రాయలసీమ విద్యార్థులకు 28న తిరుపతిలో ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
చదవండి: Telangana: విప్రో లైటింగ్ పరిశ్రమను ఏ జిల్లాలో ప్రారంభించారు?