Salary Hike : ఐటీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 20-25శాతం ఇంక్రిమెంట్లు..
ప్రధానంగా దేశీయ రెండో ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు వేతనాలను పెంచినట్టు ధృవీకరించింది. తన సిబ్బందికి 10 నుంచి 13 శాతం జీతాల పెంపును అందించినట్టు ప్రకటించింది. దీంతోపాటు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఉద్యోగులు 20-25శాతం ఇంక్రిమెంట్లు పొందినట్టు తెలిపింది. ఇన్ఫీ, టీసీఎస్, విప్రో,తోపాటు కాగ్నిజెంట్ సంస్థలు తమ ఉద్యోగులకు దాదాపు 10శాతం వేతనాలు పెంపును దిశలో ఉండటం విశేషం.
Microsoft Employees : భారీగా ఉద్యోగాల తొలగింపు వాస్తవమే..కానీ ఇలా కాదు
ఇంక్రిమెంట్‌లు ఉద్యోగి గ్రేడ్‌పై ఆధారపడి ఉంటాయయనీ, సీనియర్ మేనేజ్‌మెంట్ జీతాలు ఎక్కువగా ఉన్నందున తక్కువ మొత్తంలో పెంపు ఉంటుందని ఇన్ఫోసిస్ హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గ్రూప్ హెడ్ క్రిష్ శంకర్ తెలిపారు. తగ్గుతున్న అట్రిషన్ రేట్లతో, ఇన్ఫోసిస్ వినియోగ స్థాయిలను పెంచడం, పార్శ్వ నియామకాలు, ఆన్-సైట్ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం ద్వారా వేతన వ్యయాలను నియంత్రించడానికి ప్రయత్నిస్తోంది. ఇన్ఫోసిస్‌తోపాటు, టీసీఎస్, విప్రో, ప్రపంచ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ కూడా తన ఉద్యోగులకు 10 శాతం వరకు వేతనాలు పెంచనుందట. అక్టోబర్ మాసం నుంచి ఈ పెంపు వర్తించనుందని తెలుస్తోంది.
Jobs : ఇంటెల్ చరిత్రలోనే తొలిసారిగా.. భారీగా ఉద్యోగులను తొలగింపు.. ఎందుకంట..?!
కాగా కరోనా సంక్షోభకాలంలో ముఖ్యంగా 2021లో ఐటీ కంపెనీల బంపర్ జీతాల పెంపు, కౌంటర్ ఆఫర్‌లతో ఉద్యోగులను నిలబెట్టుకునే ప్రయత్నాలు చేశాయి. ఇన్ఫోసిస్ కూడా గత ఏడాది జనవరి, జూలైలో రెండు పెంపులను ప్రకటించింది. ప్రస్తుతం ఈ పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. 345,218 మంది నిపుణులకు ఉపాధి కల్పించిన ఇన్ఫీ, అధిక వ్యయాలను నియంత్రించుకోవాలని చూస్తోంది.
Work From Home : వర్క్ ఫ్రమ్ హోమ్‌పై ఉద్యోగులకు కీలక ఆదేశాలు ఇవే..