Lachezara Stoeva: ఏపీ విద్యా విధానాలు భేష్
ఐక్యరాజ్య సమితి లక్ష్యం కూడా ఇదేనని స్పష్టం చేశారు. ఐరాస ప్రధాన కార్యాలయమైన న్యూయార్క్‌లో ఆర్థిక, సామాజిక మండలి నేతృత్వంలో సుస్థిరాభివృద్ధిపై జూలై 17న జనరల్ అసెంబ్లీ హాలులో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు – నేడు, విద్యారంగంలో పధకాలకు సంబంధించి ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేశారు. జగనన్న విద్యాకానుక కిట్లు, విద్యా దీవెన, అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యార్ధులకు ఇచ్చే ఇతర ప్రోత్సాహకాల పోస్టర్లను ప్రదర్శించారు.
చదవండి: Digital Education: బోధనలోను సాంకేతిక విధానానికి ప్రభుత్వం స్వీకారం
ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ బోర్డులు, అటల్ టింకరింగ్ ల్యాబ్స్, స్మార్ట్ బోర్డ్స్, బైజూస్ ట్యాబ్స్ నమూనాలను ప్రదర్శించారు. ఐరాస స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ వున్నవ షకిన్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన విద్యారంగ సంస్కరణలు, వివిధ పథకాల ద్వారా విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించేలా సీఎం జగన్ ప్రోత్సహిస్తున్న తీరు, డిజిటల్ బోధన, డిజిటల్ క్లాస్ రూమ్స్ గురించి వివరించారు. నాడు – నేడు స్టాల్‌ని సందర్శించిన ఎకనామిక్ సోషల్ కౌన్సిల్ ప్రపంచ అధ్యక్షురాలు లచ్చెజర స్టోవ్ ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు.
చదవండి: Better Teaching: ఈ యూనివర్సిటీలో ఫిజిక్స్ విద్యార్థులకు మంచి రోజులు
సీఎం జగన్ బాలికల విద్యను ప్రోత్సహిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడాన్ని అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు టోఫెల్ ట్రైనింగ్, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్, బైలింగ్యువల్ డిక్షనరీలు, గోరుముద్ద, ఆణిముత్యాల పథకాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. పేద విద్యార్ధులను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని షకిన్ కుమార్ ఆమెకు వివరించారు. డిజిటల్ ఇండియా దిశగా అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ విద్యా విధానాలను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ప్రశంసించారు.
చదవండి: S Abdul Nazeer: విద్య అత్యంత శక్తివంతమైన ఆయుధం
ఏపీ స్టాల్‌పై పలు దేశాల ఆసక్తి
టాంజానియా ఆర్థిక శాఖా మంత్రి నటూ వాంబా ఏపీ స్టాల్‌ను సందర్శించి విద్యాభివృద్ధికి సీఎం జగన్ చేస్తున్న కృషిని అభినందించారు. అమెరికా పర్మినెంట్ అబ్జర్వర్ మిషన్ టూ యునైటెడ్ నేషన్స్ ప్రొఫెసర్ ఒట్టో ఫీజిన్ బ్లాట్, అమెరికన్ డిప్లొమాటిక్ అకాడమి రిప్రజెంటేటివ్ టు యునైటెడ్ నేషన్స్ ప్రెసిడెంట్ బిల్ గ్రాహమ్ తదితరులు ఏపీ విద్యా విధానాలను తెలుసుకుని అభినందించారు. ఈ కార్యక్రమంలో సునీత చిట్టూమూరి తదితరులు పాల్గొన్నారు.