Better Teaching: ఈ యూనివర్సిటీలో ఫిజిక్స్ విద్యార్థులకు మంచి రోజులు
స్థానిక యూనివర్సిటీ సెమినార్ హాలులో ‘ఎక్స్‌ప్లోరింగ్ ది సినర్జీ: ఫిజిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’ అనే అంశంపై సోమవారం గెస్ట్ లెక్చర్ కార్యక్రమం జరిగింది. దీనికి రిసోర్స్‌పర్సన్‌గా హాజరైన ఐఏపీటీఆర్‌సీ–11 సెక్రటరీ ఆచార్య జి.సహాయ భాస్కరన్‌తో నన్నయ వీసీ ఆచార్య కె.పద్మరాజు ఇందుకు సంబంధించిన ఒడంబడిక పత్రాలపై సంతకాలు చేశారు.
Civils Rankers: అతి పిన్న వయసులో ఐఏఎస్ అయ్యింది వీరే... వీరి కుటుంబ నేపథ్యం ఏంటంటే...
ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఇంజినీరింగ్‌కు మూలం ఫిజిక్స్ అని, ఫిజిక్స్‌లోని మూలాలను అన్వేషిస్తే శాస్త్రవేత్తల కృషి అర్థమవుతుందన్నారు. ప్రభుత్వాలు కూడా ఆయా విభాగాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపించేలా విద్యార్థులకు అవకాశాలను కల్పిస్తున్నాయన్నారు.
విద్యార్థులంతా ఫిజిక్స్‌పై పట్టు సాధిస్తే భవిష్యత్‌లో మంచి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చన్నారు. ఈ ఒప్పందం ద్వారా వివిధ ఉమ్మడి కార్యకలాపాలు, విద్యార్థులు, ప్రజలలో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించడం, ఫిజిక్స్‌లో జాతీయ స్థాయి పరీక్షలను ప్రోత్సహించడం, ఏపీలోని పాఠశాలలు, కళాశాలలో ఫిజిక్స్/సైన్స్ ఉపాధ్యాయుల అభివృద్ధి, శిక్షణా కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం, అకడమిక్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్ తదితరాలు నిర్వహించేందుకు అవకాశం ఉంటుందన్నారు.
250 posts in Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో 250 అప్రెంటిస్‌లు.. ఎంపిక విధానం ఇలా..
రిసోర్స్‌పర్సన్ ఆచార్య సహాయ భాస్కరన్ మాట్లాడుతూ డేటా మేనేజ్‌మెంట్‌లో మాగ్నటిక్, ఆప్టికల్ స్టోరేజ్ ప్రాముఖ్యతతో పాటు డిజిటలైజేషన్ వెనుక ఉన్న ఫిజిక్స్ భావనలను వివరించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇటీవల ఎంతో పురోగతిని సాధించామన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ పి.విజయనిర్మల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ఆచార్య పి.సురే ష్‌వర్మ, ప్రోగ్రామ్ కన్వీనర్ డాక్టర్ ఎస్.రాజ్యలక్ష్మి, ఆచార్య వై.శ్రీనివాసరావు, డాక్టర్ కె.రమణేశ్వరి, డాక్టర్ పి.వెంకటేశ్వర్రావు, డాక్టర్ ఎన్.ఉదయ్‌భాస్కర్ పాల్గొన్నారు.