DSC 2024 Results: డీఎస్సీలో సత్తాచాటారు.. కష్టపడి చదివి ర్యాంకులు పొందిన జిల్లాలో పలువురు యువత

జిల్లా టాపర్‌గా
తాండూర్: మండలంలోని అచ్చులాపూర్‌కు చెందిన ఏకారి ఆంజనేయులు భౌతిక శాస్త్రంలో జిల్లా టాపర్‌గా నిలిచాడు. ఏకారి సత్యనారాయణ–పద్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కాగా కుమారుల్లో ఆంజనేయులు చిన్నవాడు. బజ్జీల బండిపెట్టి వచ్చే కొద్దిపాటి ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నా తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటూ ఆంజనేయులు కష్టపడి చదివి డీఎస్సీకి ప్రిపేర్ అయ్యాడు. భౌతికశాస్త్రం విభాగంలో జిల్లాలో ఒకే పోస్టు ఉండగా పరీక్ష రాసి జిల్లా టాపర్‌గా నిలిచాడు. తల్లిదండ్రులు, భార్య సంధ్య ప్రోత్సాహంతోనే సాధించానని ఆంజనేయులు తెలిపాడు.
– ఆంజనేయులు
జిల్లాలో ప్రథమ ర్యాంక్
బజార్‌హత్నూర్: బజార్‌హత్నూర్‌కు చెందిన పురింశెట్టి నర్సయ్య స్కూల్ అసిస్టెంట్ తెలుగు భాషా పండిత్ సబ్జెక్టులో జిల్లా ప్రథమ ర్యాంక్ సాధించారు. మోర్కండికి చెందిన లోవెకార్ రాహుల్..ఎస్జీటీలో (జనరల్) 106 ర్యాంక్, హిందీ పండిత్ (ఎస్జీటీ)లో 8వ ర్యాంకులు, సర్పె అమోల్ (ఎస్జీటీ జనరల్)కు 41వ ర్యాంకు, దేగామ గ్రామానికి చెందిన నాగరాజు శ్రీనివాస్ ఎస్జీటీలో 44 ర్యాంకు సాధించారు.
పురింశెట్టి నర్సయ్య
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
ఎలాంటి కోచింగ్ లేకుండానే..
దండేపల్లి: మండలకేంద్రానికి చెందిన గుర్రం మురళీమోహన్–సుజాత దంపతులు వ్యవసాయం చేస్తుంటారు. వారి కూతురు తేజశ్విని రెండేళ్ల క్రితం టీటీసీ పూర్తిచేసింది. డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడింది. ఇంటివద్దనే ఉండి డీఎస్సీకీ ప్రిపేర్ అయింది. 76.70 మార్కులు సాధించి, జిల్లా 52వ ర్యాంకు సాధించింది.
– గుర్రం తేజశ్విని, దండేపల్లి
పేదింటి బిడ్డకి ర్యాంక్
నిర్మల్‌రూరల్: మండలంలోని వెంగ్వాపేట్‌కు చెందిన గడ్డం లక్ష్మి–గడ్డం జీవన్ దంపతుల కుమార్తె అనూష సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ విభాగంలో జిల్లాస్థాయిలో 6వ ర్యాంకు సాధించింది. ఆమె విజయం పట్ల కుటుంబ సభ్యులు హహర్షం వ్యక్తంచేశారు.
గడ్డం అనూష
నిర్మల్ జిల్లాలో నాలుగవ ర్యాంక్
కుంటాల: కుంటాలకు చెందిన అల్లకొండ హిమబిందు జిల్లాలో నాలుగవ ర్యాంకు సాధించింది. భర్త శ్రీనివాస్ ఆర్‌ఎంపీ వైద్యుడు. హిమబిందు గతంలో కేజీవీబీ టీచర్‌గా, ప్రస్తుతం భైంసా కేజీవీబీలో జూనియర్ లెక్చరర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ర్యాంకు సాధించిన ఆమెను పలువురు అభినందించారు.
– హిమబిందు