Education: విద్యాశాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం సమీక్ష
8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు ఇచ్చే స్కీంకు సంబంధించి ట్యాబ్లు రావడం మొదలయ్యిందని అధికారులు తెలిపారు. లక్షన్నరకు పైగా ట్యాబ్లు అందుబాటులో ఉన్నాయని, మిగిలినవి కూడా త్వరలోనే వస్తున్నాయన్నారు. ట్యాబ్లు వచ్చాక దాంట్లోకి కంటెంట్ను లోడ్ చేసే పనులు కూడా వెంటనే మొదలు కావాలని సీఎం అన్నారు. 8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు కలిపి మొత్తంగా 5,18,740 ట్యాబ్లు ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. బైజూస్ ఈ - కంటెంటును 4 వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ అందించనున్నారు.
చదవండి: Andhra Pradesh : వరల్డ్ బ్యాంక్ ఆర్థిక సాయం.. ‘నాడు-నేడు’ను గుర్తించి..
ఈ సమీక్షలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ సమీర్ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ కార్యదర్శి ఏ సాంబశివారెడ్డి,ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.