Andhra Pradesh : వరల్డ్ బ్యాంక్ ఆర్థిక సాయం.. ‘నాడు-నేడు’ను గుర్తించి..
ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఇంగ్లీషు మీడియంలో నాణ్యమైన చదువులు అందించే ‘నాడు-నేడు’కు వరల్డ్ బ్యాంకు ఆర్థిక సాయం ప్రకటించింది.
250 మిలియన్ డాలర్లతో మరింత సమర్థవంతంగా పథకం అమలు చేసేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు 250 మిలియన్ డాలర్ల నిధులను షరతులు లేని రుణంగా మంజూరు చేసింది. రాష్ట్రంలో నాడు-నేడు పథకం క్రింద పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో ఇప్పటికే నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వం రూ. 53 వేల కోట్లు..
సాల్ట్ (SALT-Supporting AP Learning Transformation) ప్రాజెక్టు కింద కొత్తగా ప్రపంచ బ్యాంకు 250 మిలియన్ డాలర్ల ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. ఈ సాయంతో మొత్తం ప్రపంచ బ్యాంకు నిధులతో పాఠశాల విద్యాశాఖలో చేపట్టిన ఇది తొలి ప్రాజెక్టుగా నిలవనుంది. గడచిన మూడేళ్లలో పాఠశాల విద్యాశాఖలో ప్రభుత్వం రూ. 53 వేల కోట్ల ఖర్చు చేసింది. ఒక్క అమ్మ ఒడి పథకానికే రూ.19,617 కోట్లు సీఎం జగన్ కేటాయించారు. వచ్చే ఇదేళ్లలో ఈ నిధులను ఉపయోగించుకుని జరిగే అభివృద్ధి ని ప్రోగ్రాం ఫర్ రిజల్ట్స్ కింద చూడనున్నట్లు వరల్డ్ బ్యాంకు పేర్కొంది.